పెళ్లి వేడకలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుగుతుంటాయి. సంప్రదాయం ఏదైనా వివాహ వేడుకను ఘనంగా నిర్వహిస్తారు. అయితే కొన్ని ప్రాంతాల్లో వరుడు షేర్వాణీ ధరించి గుర్రం మీద పెళ్లికూతురు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వివాహ వేడుకకు వస్తాడు. అయితే వరుడు వచ్చినట్లుగానే వధువు.. షేర్వాణీ ధరించి గుర్రం మీద తన ప్రీ-వెడ్డింగ్ కార్యక్రమంలో పాల్గొంటుంది.
రాజస్థాన్‌లోని సికర్ జిల్లాలో రనోలి గ్రామానికి చెందిన వధువు కార్తిక గుర్రంపై వచ్చి.. ప్రీ-వెడ్డింగ్ ‘బండోరి’ వేడుకల్లో అందరినీ దృష్టిని ఆకర్షించింది. తాము జెండర్ ఇక్వాలిటీ పాటిస్తామని కొడుకు అయినా కూతురైనా ఒకేలా చూస్తామని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. అందుకోసమే కార్తిక వివాహం సందర్భంగా ఇలా ప్లాన్ చేసినట్లు పేర్కొన్నారు. ఆమె వివాహం సోమవారం జరగాల్సి ఉంది.
‘బండోరి’ వేడుక కోసం కార్తిక స్వయంగా షేర్వాణీ తయారు చేయటం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘గుర్రంపై వరుడి కంటే వధువు వస్తేనే బాగుంటుంది’.. ‘జెండర్ ఇక్వాలిటీకి ఇది ఓ ముందడుగు’ అని ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment