‘థ్యాంక్యూ సర్‌’ అన్నందుకు విమానం నుంచి దించారు! Texas mother claims her family kicked off a flight for accidentally misgendering a attendant | Sakshi
Sakshi News home page

‘థ్యాంక్యూ సర్‌’ అన్నందుకు విమానం నుంచి దించారు!

Published Fri, Jun 28 2024 2:33 PM | Last Updated on Fri, Jun 28 2024 2:33 PM

Texas mother claims her family kicked off a flight for accidentally misgendering a attendant

ఎవరైనా మిమ్మల్ని సర్‌..అనబోయి పొరపాటును మేడమ్‌ అన్నారంటే.. ఏం చేస్తారు? సర్లే.. ఏదో కంగారులో అని ఉంటారని అసలు ఆ విషయాన్నే పట్టించుకోరు కదా. కానీ ఇటీవల యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో మహిళా సిబ్బందిని పొరపాటున ‘సర్‌’ అన్నందుకు ఏకంగా విమానంలో నుంచే దించేశారు. దాంతో సదరు ప్రయాణికురాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

టెక్సాస్‌కు చెందిన జెన్నా లాంగోరియా తన కుమారుడు(16 నెలలు), తల్లితో కలిసి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఆస్టిన్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. విమానం ఎక్కే సమయంలో సిబ్బంది బోర్డింగ్‌ పాస్‌ను అందించారు. దాంతో మహిళా అటెండెంట్‌ను పొరపాటుగా పురుషునిగా భావించి ‘థాంక్యూ సర్‌’ అని తెలిపింది. వెంటనే ఆ అటెండెంట్‌ ఆగ్రహానికి గురైంది. జెన్నా తల్లిని, బిడ్డను లోనికి వెళ్లకుండా ఆపేసింది. అదే సమయంలో జెన్నా మరో మేల్‌ అటెండెంట్‌ సాయం కోరింది. తన తల్లి, కుమారుడిని గేట్‌ వద్ద మరో మేల్‌ అటెండెంట్‌ ఆపేశారని ఫిర్యాదు చేసింది. దాంతో ఆ సిబ్బంది.. మీరు ఫిర్యాదు చేయాలనుకున్న అటెండెంట్‌ ‘ఆయన’ కాదు ‘ఆమె’ అని బదులిచ్చారు. తన తప్పును తెలుసుకుని ఆ మహిళా సిబ్బందికి క్షమాపణలు చేప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. అంతటితో ఆగకుండా విమానం నుంచి దింపేశారని సోషల్‌ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement