న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో స్త్రీ, పురుషుల మధ్య వేతన చెల్లింపుల పరంగా అసమానత పెరిగినట్టు ఏడీపీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అధ్యయనంలో వెల్లడైంది. వేతన పెంపులు, బోనస్‌ల పరంగా చూస్తే పురుషల కంటే మహిళలు వెనుకనే ఉన్నట్టు పేర్కొంది. ‘పీపుల్ ఎట్ వర్క్ 2021: ఏ గ్లోబల్ వర్క్‌ఫోర్స్ వ్యూ’ పేరుతో ఏడీపీ అధ్యయనం నిర్వహించింది. పురుష ఉద్యోగుల్లో 70 శాతం మందికి వేతనాల పెంపు, బోనస్‌ను సంస్థలు ప్రకటించగా.. మహిళల్లో అధిక బాధ్యతలు మోస్తున్నా కానీ 65 శాతం మందికే ఈ భాగ్యం దక్కినట్టు తెలిపింది. కరోనా వల్ల తమ సంస్థలపై అదనపు బాధ్యతలు పడగా.. పురుషులతో సమానంగా మహిళలూ ఈ బాధ్యతలను స్వీకరించారని వివరించింది.
ఈ సర్వేలో భాగంగా 17 దేశాల్లో మొత్తం 32,471 మంది ఉద్యోగుల అభిప్రాయాలను ఏడీపీ సేకరించింది. 2020 నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉద్యోగుల నుంచి వివరాలు సమీకరించింది. వాటన్నింటీని క్రోడీకరించిన ఏడీపీ.. ఈ వివరాలను తాజాగా విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment