లండన్: హర్ట్‌ఫోర్డ్‌షైర్‌లో పుట్టి పెరిగిన కైరా బెల్ జన్మతా ఆడపిల్ల. రింగు రింగుల జుట్టుతో చిన్నప్పుడు అచ్చం ఆడ పిల్లలాగే ఉన్నా మగపిల్లల్లా గదమ మీద, చేతుల మీద వెంట్రుకలు వచ్చేవి. వాటిని రేజర్‌తో షేవ్ చేసుకోవాల్సి వచ్చేది. గొంతు కూడా ఆడ పిల్లలాగ కాకుండా పీల గొంతు ఉండేది. ఈ లక్షణాలకు తగినట్లుగానే ఆమెకు చిన్నప్పటి నుంచి మగవాళ్ల దుస్తులే ధరించేది టామ్‌బాయ్ (మగ దుస్తులు ధరించే ఆడపిల్ల)లాగా. ఆడ పిల్లల దుస్తులు «ధరించాల్సిందిగా తల్లి ఎంత మొత్తుకున్న వినేది కాదు. భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్న తల్లితోనే ఆమె ఉండేది.
రానురాను కైరా బెల్ శరీరంలో మగ లక్షణాలతోపాటు ఆలోచనల్లో కూడా మగ లక్షణాలే పెరగడంతో సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంది. 16వ ఏటా బ్రిటన్ నేషనల్ హెల్త్ స్కీమ్ ఆధ్వర్యంలో నడుస్తున్న లండన్‌లోని ‘ది టావిస్టాక్ సెంటర్’ చికిత్సా కేంద్రాన్ని సందర్శించింది. మూడున్నర గంటల కౌన్సిలింగ్ ద్వారా ఆమెకు సెక్స్ మార్పిడి చేయాలని వైద్యులు నిర్ణయించారు. ముందుగా ఆడ లక్షణాలకు సంబంధించిన హార్మోన్స్‌ను అడ్డుకునే మందులు ఇచ్చారు. ఆ తర్వాత సెక్స్ మార్పిడి ఆపరేషన్ చేశారు. ఆమెలో మహిళా హార్మోన్లు నశించడంతోపాటు పీరియడ్స్ ఆగిపోయాయి. లైంగిక కోరిక చచ్చిపోయింది. ఈ దశంలో ఆమెకు ‘టెస్టాస్టెరోన్’ హార్మోన్ల ఇంజెక్షన్లు ఇచ్చారు.
అప్పుడు గడ్డం, మీసాలు బాగానే పెరిగాయి. ఆడ పిల్లల్లాగా బ్రెస్ట్ కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో ఆమె తన 20వ ఏట ఆపరేషన్ ద్వారా బ్రెస్ట్ తీసేయించుకున్నారు. మళ్లీ పెరగకుండా ‘ప్రెసింగ్’ ట్రీట్‌మెంట్ తీసుకుందిజ ఈ క్రమంలో ఆమె ఎంతో బాధను అనుభవించింది. బర్త్ సర్టిఫికేట్, విద్యార్హతల్లో జెండర్‌ను ఆడ నుంచి మగగా మార్చుకోవడానికి కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఎంత కష్టపడ్డా పూర్తి మగ లక్షణాలు రాలేదు. దాంతో ఆమె పునరాలోచనలో పడింది. టెస్టోస్టెరోన్ ఇంజెక్షన్లు తీసుకోవడం మానేసింది. దాంతో ఆమెకు తిరిగి పీరియడ్స్ మొదలయ్యాయి. గడ్డం, మీసాలు పెరగడం తగ్గాయి. లైంగిక కోరికలు కలగడం కూడా మొదలయింది. తిరిగి ఆడపిల్ల కావాలనుకుంది.
ఇక్కడే ఆమె జీవితం కొత్త మలుపు తిరిగింది. ‘ది టావిస్టాక్ సెంటర్’ 18 ఏళ్లు నిండని మైనర్లకు సెక్స్ మార్పిడి ఆపరేషన్లు చేయడం చట్టవిరుద్ధమంటూ దాఖలైన కేసులో ప్రత్యక్ష సాక్షిగా కైరా బెల్‌ను పేర్కొన్నారు. అందుకని ఆమె సెక్స్ మార్పిడికి ‘ది టావిస్టాక్’గానీ, ప్రాసిక్యూటర్లుగానీ అనుమతించడం లేదు. ఈ కేసు హైకోర్టులో తేలదని, బ్రిటన్ సుప్రీం కోర్టు వరకు వెళ్లాల్సి ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. సుప్రీంలో కేసు తేలడానికి కొన్నేళ్లు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు కైరా నిరీక్షించాల్సిందే.
‘నాది ఆడ లేదా మగ కాని బతుకైనది. రెండింటి మధ్య నలిగి పోతున్నాను. సెక్స్ మార్పిడి కోరుకునే వారికి నా అనుభవాలు ఓ గుణపాఠం కావాలి’ అని కైరా సమాజానికి సందేశం ఇస్తున్నారు. ఇంతకుముందు బ్రిటన్ చార్లీ ఎవాన్స్ ముందు ఆడ పిల్ల, సెక్స్ మార్పిడి ద్వారా పురుషుడయ్యారు. మళ్లీ ఆపరేషన్ ద్వారా ఆడపిల్లగా మారారు.
ఇలాంటి అనుభవాలు ఉన్నప్పటికీ బ్రిటన్‌లో లింగ మార్పిడికి 13,500 మంది నిరీక్షణ జాబితాలో ఉన్నారు. 2009–10 సంవత్సరంలో 18 ఏళ్లలోపు ఆడపిల్లలు 40 మంది లింగ మార్పిడి ఆపరేషన్ చేసుకోగా వారి సంఖ్య 2017–2018 సంవత్సరానికి 1806కు చేరుకుంది. ఇక మగవారి సంఖ్య 57 నుంచి 753కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment