శబరిమల ఆలయంలోకి అన్ని వయ సుల మహిళలను అనుమతించాలన్న తీర్పుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై వచ్చే జనవరి 22న ఓపెన్ కోర్టులో విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. సెప్టెంబర్ 23వ తేదీ నాటి తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన 48 పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్ర చూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాల ధర్మాసనం మంగళవారం సుప్రీంకోర్టు చాంబర్‌లో విచారణ చేపట్టింది.