‘నా భర్త ఉన్నది కేవలం అందుకే.. కాబట్టి’ | Pakistani Woman With Hubby In Burqa Internet Praises Her Post Over Patriarchy | Sakshi
Sakshi News home page

‘నా భర్త ఉన్నది కేవలం తల్లిని చేయడానికే’

Published Tue, Apr 9 2019 12:17 PM | Last Updated on Tue, Apr 9 2019 6:14 PM

Pakistani Woman With Hubby In Burqa Internet Praises Her Post Over Patriarchy - Sakshi

‘అమ్మో ఎంత ధైర్యం ఈ పిల్లకి. పెళ్లైన కొత్తలోనే భర్తను కొంగుకు ముడేసుకుందే. ఓ ఆడపిల్ల మాట్లాడాల్సిన మాటలేనా ఇవి. అయ్యో అయ్యో భర్తకే ముసుగేస్తుందా. పాకిస్తాన్‌లో ఉండి కూడా పితృస్వామ్య వ్యవస్థ గురించి ఇలాంటి వెటకారాలు చేస్తుందా. ఈ అమ్మాయికి బుద్ధి చెప్పాల్సిందే’ అంటూ కొంతమంది సంప్రదాయ వాదులు బుగ్గలు నొక్కుకున్నా పర్లేదు నా తీరు మార్చుకోను అంటున్నారు ఫొటోలో కన్పిస్తున్న ఈ వివాహిత. పైగా మీలాంటి వాళ్ల కోసమే.. ఇలాంటి పోస్టు పెట్టాను. ఇప్పటికైనా ఆడ, మగ అంతా సమానమని గుర్తిస్తే ఇలాంటి సన్నాయినొక్కులు నొక్కాల్సిన అవసరం రాదంటూ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు. విమర్శలు లెక్కచేయక తన కొత్త జీవితానికి సంబంధించిన విశేషాలను జోడిస్తూ ‘న్యూలీవెడ్స్‌’ అనే ఇన్‌స్టా అకౌంట్లో తన భర్తతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేసి అనాదిగా కొనసాగుతున్న లింగ వివక్షను ఎత్తిచూపారు.

‘ఈయనే అందమైన నా శ్రీవారు. మా ఆయన అందమైన ముఖాన్ని మీరు చూడలేరు. నా కోసం ఆయన తన అందాన్ని ఇలా దాచుకుంటారు. ఎందుకంటే ఆయన అందం, సాధించిన విజయాలు, కలలు ఇలా ఒక్కటేమిటి తన జీవితానికి సంబంధించిన ప్రతీ విషయానికి నేనే హక్కుదారును కదా. తనకు దిష్టి తగలకూడదనే ఈ పాడు ప్రపంచానికి దూరంగా.. తననెప్పుడూ ఇంట్లోనే ఉండమంటాను. అయితే నాతో పాటు అప్పుడప్పుడూ బయటికి తీసుకువెళ్తా. నిన్న రాత్రి తనను డిన్నర్‌కు తీసుకువెళ్లాను. అక్కడ స్టెరాయిడ్‌ ఫ్రీ చికెన్‌ మాత్రమే ఆర్డర్‌ చేశాం. ఎందుకంటే తన ఆరోగ్యం గురించి నాకు శ్రద్ధ ఉంది. ఒకవేళ ఇలాంటి ఆహారం తినడం వల్ల సంతాన భాగ్యానికి భంగం కలిగితే ఎలా. అసలు ఆయన ఉన్నదే నన్ను తల్లిని చేయడానికి. పిల్లల్ని కనివ్వడానికి. అందుకే ఏం తినాలో ఏం తినకూడదో నేనే నిర్ణయిస్తా. తనను బయటికి తీసుకువెళ్లినపుడు ఇలా దాచేస్తా(బుర్ఖా వెనుక). ఒకవేళ తన అందానికి ముగ్ధులై ఎవరైనా వేధిస్తే. వేధించారే అనుకోండి అప్పుడు వాళ్లను ఎవరో శిక్షిస్తారని సరిపెట్టుకుంటా’ అంటూ ఓ పాకిస్తానీ వివాహిత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన స్టోరీ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తన భర్తకు బుర్ఖా వేసి.. అతడితో దిగిన సెల్ఫీని పోస్ట్‌ చేసిన సదరు మహిళ లింగ వివక్ష, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతా..
‘ వేరే వాళ్లకే నేను నియమాలు విధిస్తా. నేను మాత్రం ఇష్టం వచ్చినట్లుగా ఉంటా. ఎలాంటి దుస్తులైనా సరే వేసుకుని తిరుగుతా. ఎందుకుంటే నేను ఆడదాన్ని. ఇతర ఆడవాళ్ల గురించి పట్టించుకోను. ఒకవేళ నాపై ఎవరైనా దాడి చేసినా, ఏమైనా అన్నా తిరిగి మాట్లాడను. అలా చేస్తే నేను పిరికిదాన్నని ఈ లోకం భావిస్తుంది. ఆడవాళ్లు బలహీనంగా ఉండకూడదు కదా. నేను మరీ అంత లింగ వివక్ష చూపనులెండి. మా ఆయన డ్రైవింగ్‌ చేసేందుకు అనుమతిస్తా. ఉద్యోగానికి పంపిస్తా. అయితే అక్కడ ఆయన ఎవరితోనైనా మాట్లాడటం పూర్తిగా నిషిద్ధం. నా భర్తను కాపాడుకోవాలంటే కేవలం ఇలా చేస్తే చాలు. లేకపోతే నాకు ‘స్వర్గసుఖాలు’ ఎలా లభిస్తాయి’ అంటూ సదరు వివాహిత పితృస్వామ్య వ్యవస్థ తీరును ఎండగట్టారు.

ఈ క్రమంలో... ‘ మీ భర్త ఉద్యోగం చేయడానికి అనుమతించకండి. ఇలా చెప్పడం వెనుక ఏ లాజిక్‌ లేదు. కానీ మీరు మగవారిని అలా ఒంటరిగా బయటకు పంపకండి. ఇంకో విషయం మీ భర్త ముఖం బుర్ఖాలో నుంచి కూడా కనిపిస్తోంది. సరిగ్గా కవర్‌ చేసుకోమని చెప్పండి’ అంటూ కొంతమంది ఆమెకు మద్దుతుగా నిలుస్తుండగా మరికొంత మంది నెటిజన్లు మాత్రం ‘ఇదేం విడ్డూరం’ అంటూ వెటకారపు కామెంట్లు చేస్తున్నారు. ‘అయినా ఒక భర్త తన భార్యను ఏవిధంగా ‘ఉండాలని’ భావిస్తాడో అదే విధంగా భార్య కూడా భావించడంలో తప్పేం ఉంది. ఆడ, మగ ఇద్దరూ మనుషులే కదా. మీరు చెప్పింది 100 శాతం. సెల్యూట్‌ మేడమ్‌’ అని అని మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

This is my beautiful husband. Of course, you can't see how beautiful he is because I make sure he keeps his beauty (read: identity) hidden as I am the only true haqdaar of it. Everything he is, all his achievements, dreams, all of his fkn life, he owes it to me. Any namehram's nazar is haraam on him, so I prefer he stay at home as the world is a bad place. However, it is ok when he goes out with me. I took him to dinner at @madroostapk last night. We only go there because they use steroid free chicken and we are very health conscious, especially after knowing how growth hormone injected chicken can affect fertility. I don't want his fertility to be affected because his major purpose of existing is to give me children and make me a mother. So no matter what, I only bring him to eat out here. I Iove how he modestly hides himself while going out, as he is khuli tijori and I wouldn't want him to get molested. Even then if he gets molested, we will accept that as qismah and hope that the abuser will be punished in akhirah. I on the other hand can roam around and loiter on my own, in my chadda banyaan, in my tank top in my spaghetti strap top or even shirtless, because I am a woman. I am not scared of other women. They will not assault me. And even if they do, I will not talk about it because it will prove me weak and defenceless in front of the whole wide world. A woman is not supposed to be weak, you know, we were created to be strong and macho. Also, I let him go out to work and drive cuz I am a strong believer in equality. However, looking at na-mehrams and interacting with them in any way is strictly prohibited. It is my duty to ensure these practices as a pious husband is my key to jannah, how will I get to sleep with 70 virgins in the afterlife warna? Also photography and all is also haraam but we had to do this since in attempt to educate you all and save you from qabar ke saanp and jahannum ki aag. Where's my medal? . . . #genderroles #smashingpatriarchy #dawn #nomeansno #consent #endrapeculture #metoo

A post shared by The Mewly Weds (@themewlyweds) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement