ఆత్మహత్య చేసుకున్న ఢిల్లీ ఎయిర్‌హోస్టెస్ అనీసియా (ఫైల్‌పోటో)
సాక్షి, న్యూఢిల్లీ : భర్త వేధింపులకు విసిగి ఆత్మహత్యకు పాల్పడిన ఢిల్లీ ఎయిర్ హోస్టెస్ అనీసియా బాత్రా కేసును ఢిల్లీ పోలీస్ క్రెమ్ బ్రాంచ్‌కు తరలించారు. జులై 13న దక్షిణ ఢిల్లీలోని పంచ్‌శీల పార్క్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు మయాంక్ సింగ్వీ జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించారు. ఢిల్లీలోని తమ నివాసం టెర్రస్ పైనుంచి దూకి అనీసియా విగతజీవిగా మారిన సంగతి తెలిసిందే.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆమె మరణించేందుకు రెండేళ్ల ముందు నుంచి అనీసియాకు తన భర్తతో విభేదాలు ఉన్నట్టు సమాచారం. అయితే బాధిత మహిళ కుటుంబం మాత్రం తమ బిడ్డ చనిపోయేందుకు భర్త ఆగడాలే కారణమని ఆరోపిస్తోంది. అనీసియాను భర్త మయాంక్ అనునిత్యం వేధింపులకు గురిచేసేవాడని, 2016లో వారి రెండో హనీమూన్‌లోనే అనీసియాను భర్త దారుణంగా హింసించాడని బాధితురాలి తల్లి ఆందోళన వ్యక్తం చేశారు. అనీసియా ఆత్మహత్య కేసును విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు బాధితురాలి భర్త మయాంక్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment