కానిస్టేబుల్ కుమార్తె ఆత్మహత్య | Constable's daughter hangs self, marital discord suspected | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ కుమార్తె ఆత్మహత్య

Published Sun, Aug 17 2014 10:12 PM | Last Updated on Tue, Mar 19 2019 6:03 PM

Constable's daughter hangs self, marital discord suspected

న్యూఢిల్లీ: ఓ కానిస్టేబుల్ కూతురు వివాహిత సీలిం గ్‌ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక నరేలా ప్రాంతంలో ఈ ఘటన ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఢిల్లీ పోలీస్ కాని స్టేబుల్ దంపతులు నరేలా ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వారి కూతురు అహనా ఇటీవల కుటుంబ కలహాల కారణంగా తల్లిదండ్రుల వద్దనే  ఉంటోంది. ఈ క్రమంలోనే ఉదయం 11 గంటలకు ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో అహనాను ఆమె తల్లి సమీపంలోని ఆస్పత్రికి తరలించింది.
 
 ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఎలాంటి సూసైడ్ నోటూ లభించలేదని పోలీసులు తెలిపారు. అహనాకు  దక్షిణ ఢిల్లీలోని సరోజిని నగర్‌కు చెందిన ఇంద్రజిత్‌తో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహమైంది. అయితే వారి మధ్య సంబంధాలు సరిగా లేకపోవడంతో గత రెండు నెలలుగా నరేలా పోలీస్‌కాలనీలోని తల్లిదండ్రుల ఇంట్లో ఉంటోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement