tiolet
-
షాకింగ్ ఘటన: విమానంలో సహ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన..
ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సహ ప్రయాణికురాలిపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. నవంబర్ 26వ తేదీన న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ఒక వ్యక్తి మద్యం మత్తులో 70 ఏళ్ల మహిళపై మూత్ర విసర్జన చేశాడు. మధ్యాహ్న భోజనం తర్వాత లైట్లు ఆరిపోవడంతో.. అక్కడ ఏం జరుగుతోందో కొందరి ప్రయాణికులకే అర్థమైంది. పైగా మూత్ర విసర్జన తర్వాత కూడా ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్లకుండా అలానే నుంచొని ఉన్నాడు. అతడి వికృత చర్య కారణంగా.. సదరు ప్రయాణికురాలి బట్టలు, బూట్లు, మూత్రంతో తడిచిపోయాయి. దీంతో ఆమె విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత విమాన సిబ్బంది ఆమెకు బట్టలు, చెప్పులు ఇచ్చి మళ్లీ తన సీటుకే రావలని చెప్పారు. ఐతే ఆమె అందుకు గట్టిగా నిరాకరించడంతో మరో సీటు పురమాయించారు.ఐతే సిబ్బంది ఆ సీటు కవర్లు మార్చి, వాసన రాకుండా స్ప్రె చల్లారు గానీ ఆ సీటుపై కూర్చోవాలంటేనే చిరాకనిపించదని ఆ మహిళ వాపోయింది. ఆ ఘటన తర్వాత ఆమె మరొక సిబ్బంది సీటులో కూర్చొని విమానంలో మిగతా ప్రయాణాన్ని కొనసాగించారు. ఢిల్లీలో విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడా సదరు ఎయిర్‌లైన్ అధికారులు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సదరు మహిళకు మరింత కోపం తెప్పించింది. దీంతో ఆ మహిళ టాటా గ్రూప్ చైర్మన్‌కి ఈ విషయమై లేఖ రాశారు. అంతేగాదు ఆమె లేఖలో.. బిజినెస్ క్లాస్‌లో సీట్లన్నీ ఖాళీగా ఉన్నప్పటికీ మరో క్యాబిన్ సీటు కూడా తనకి ఇవ్వలేదని ఎయిర్ ఇండియా సిబ్బందిపై కూడా ఆరోపణలు చేసింది. దీంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ విషయమై సదరు ఎయిర్‌లైన్ నుంచి వివరణ కోరింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవడమే గాక సదరు వ్యక్తిని నోఫ్లై లిస్ట్‌లో చేర్చనున్నట్లు పేర్కొంది. (చదవండి: బీజేపీ నాయకుడి అక్రమ హోటల్ని..ఏకంగా 60 డైనమైట్లతో ధ్వంసం) -
ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ క్లీన్ చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
-
Hyderabad: ఆమె కోసం.. ఎలక్ట్రిక్ మొబైల్ టాయ్లెట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో మహిళల సదుపాయార్థం ఇప్పటికే షీ టాయ్లెట్లు, మొబైల్ టాయ్లెట్లు వంటివి అందుబాటులోకి తెచ్చిన యంత్రాంగం తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల మొబైల్ టాయ్లెట్లను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ వివిధ మెట్రో నగరాల్లో సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద మహిళల రక్షణ, భద్రతలకు సంబంధించిన సదుపాయాలు, ఏర్పాట్ల కోసం ‘నిర్భయ’ ఫండ్స్ నుంచి నిధులు అందజేస్తోంది. అలా అందిన నిధులతో మహిళల మొబైల్ టాయ్లెట్ల కోసం ఎలక్ట్రిక్ వాహనాలు సమకూర్చుకున్న పోలీసు శాఖ.. వాటి నిర్వహణను జీహెచ్ఎంసీకి అప్పగించింది. గ్రేటర్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలోని ఆరు జీహెచ్ఎంసీ జోన్లలో వీటిని ఉంచారు. సికింద్రాబాద్ జోన్లో 3 వాహనాలు, ఎబీనగర్‌లో జోన్లో 3, ఖైరతాబాద్‌జోన్‌లో 2, చారి్మనార్ జోన్లో 2, శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లలో ఒక్కొక్కటి చొప్పున ఈ ఎలక్ట్రిక్ మొబైల్ బస్సులను ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. మహిళలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో వీటిని ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ట్యాంక్‌బండ్, ధర్నాచౌక్, చార్మినార్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, ప్రగతిభవన్, అసెంబ్లీ, గచ్చిబౌలి జంక్షన్, రాజేంద్రనగర్, బాలానగర్, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో మహిళల రద్దీని బట్టి అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని వాహనాల్లో చంటిపిల్లలకు పాలిచ్చేందుకు గదితోపాటు శానిటరీ నాప్కిన్స్ వంటివి ఉంటాయని పేర్కొన్నారు. షీ గెస్ట్‌హౌస్.. సేఫ్‌సిటీ ద్వారా అందే నిధులతో నగరంలో మహిళా యాత్రికుల సౌకర్యార్థం గెస్ట్‌హౌస్‌ను కూడా నిర్మించనున్నారు. నాంపల్లి సరాయి వద్ద 1900 చదరపుగజాల విస్తీర్ణంలో పార్కింగ్ సదుపాయంతోపాటు అయిదంతస్తులతో నిర్మించేందుకు జీహెచ్ఎంసీ పాలకమండలి ఇదివరకే ఆమోదం తెలిపింది. మొత్తం 187 బెడ్స్ కలిగి ఉండే గెస్ట్‌హౌస్‌లో సింగిల్ బెడ్స్, షేరింగ్ బెడ్స్ ఉంటాయి. గెస్ట్‌హౌస్‌లో ఏసీతోపాటు వైఫై, లాకర్లు, లిఫ్టులు, ఇంటర్నెట్ కియోస్క్‌లు, ఎమర్జెన్సీ క్లినిక్ తదితర సదుపాయాలుంటాయి. అంచనా వ్యయం రూ.11 కోట్లు. (చదవండి: ‘ఫార్మా’లిటీస్ దందా! ) -
హవ్వా.. ఇంత అధ్వానమా
సాక్షి, పెదవేగి(పశ్చిమగోదావరి) : పైన పటారం..లోన లొటారం అన్న చందంగా ఉంది జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయం పరిస్థితి. ప్రసిద్ధి చెందిన పెదవేగిలోని ఈ విద్యాలయంలో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. బాత్రూమ్లు అధ్వానంగా ఉన్నాయి. తీవ్ర దుర్వాసన వస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలో తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన పిల్లలు పాఠశాలకు వెళ్లబోమని చెబుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం ఏమిటని అడిగితే మరుగుదొడ్ల సమస్య దారుణంగా ఉందని చెబుతున్నారన్నారు. తాము స్వయంగా వెళ్లి చూస్తే పరిస్థితి పిల్లలు చెప్పిన దానికన్నా అధ్వానంగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఇలాంటి అపారిశుద్ధ్య వాతావరణంలో తమ పిల్లలు ఉంటే రోగాల బారినపడతారని వారంతా భయపడుతున్నారు. 560 మంది విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ అధీనంలోని జవహర్ నవోదయ పాఠశాలలో మొత్తం 560 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. దీనిని పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం తక్షణమే స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరుతున్నారు. విద్యార్థులతో పనులు జవహర్ నవోదయ విద్యాలయంలో వసతులు, విద్య, అన్ని రంగాల్లో భేష్ అంటూ ఊదరగొట్టే యాజమాన్యం తరగతులు నిర్వహించే సమయంలో విద్యార్థులతో పనులు చేస్తున్నారు. ట్యాంక్ మరమ్మత్తులో భాగంగా విద్యార్థులు ఐరన్ ఊసలు పట్టుకుని సిబ్బందికి సహకరిస్తున్న దృశ్యం సాక్షి కెమెరాకు చిక్కింది. తరగతి గదుల్లో ఉండాల్సి విద్యార్థులు ఇలా పనులు చేస్తూ కనిపించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్‌తో మాట్లాడి మరమ్మతులు చేయిస్తాం నవోదయ విద్యాలయంలో టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. నవోదయ కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో ప్రజలు అందులో సీటు కోసం ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తారు. కాని సదుపాయాలు ఇలా ఉన్నాయని తెలీదు. జిల్లా కలెక్టర్‌కు చెప్పి మరమ్మతులు చేపడతాం. – కోటగిరి శ్రీధర్, ఎంపీ, ఏలూరు సమస్య 10 రోజుల్లో పరిష్కరిస్తాం అన్ని పాఠశాలల్లో టాయిలెట్స్, బిల్డింగ్స్ మరమ్మతులు చేయించాలని విద్యాశాఖ మంత్రితో మాట్లాడాను. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపడతున్నాం. కలెక్టర్ దగ్గర నుంచి అనుమతులు ఇప్పించి పది రోజుల్లో సమస్య పరిష్కరించేలా చూస్తాం. – కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు శాసనసభ్యుడు పనివాళ్లు దొరకడం లేదు విద్యాలయంలో మరుగుదొడ్లు బాలేని మాట వాస్తవమే. నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు కావాల్సి ఉంది. దానికి ఆరు నెలల సమయం పడుతుంది. మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి పనివాళ్లు దొరకడం లేదు. దాంతో సక్రమంగా శుభ్రం చేయించలేకపోతున్నాం. – డాక్టర్ వైఎస్ఎస్ చంద్రశేఖర్, ప్రిన్సిపల్, నవోదయ విద్యాలయం -
కాంట్రాక్టర్‌ను జైలులో పెట్టండి..
వన్‌టౌన్ : కృష్ణా పుష్కరాల సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల నిర్వహణపై జిల్లా కలెక్టర్ బాబు.ఏ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ తీసుకున్న కాంట్రాక్టర్‌ను జైలులో పెట్టాలంటూ పోలీసు అధికారులను ఆదేశించారు. పిచ్చిపిచ్చి వేషాలు వేసి డబ్బులు కాజేయాలని చూస్తే ఊరుకుంటామనుకుంటున్నారా...అంటూ తీవ్రంగా హెచ్చరించారు. పుష్కరాల సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు, నిర్వహణకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. అందులో భాగంగా 1800 మరుగుదొడ్ల ఏర్పాటుకు పూనేకు చెందిన లాల్జీ అనే కాంట్రాక్టర్ రూ.రెండు కోట్లకు కాంట్రాక్ట్ పొందాడు. నగరంలో వివిధ ప్రాంతాల్లో మరుగుదొడ్ల ఏర్పాటు, సిబ్బంది కేటాయింపు, నిర్వహణ వారే చూడాలి. ఆ సంస్థ మరుగుదొడ్ల నిర్వహణలో పూర్తిగా విఫలం చెందింది. దానిపై కార్పొరేషన్ అధికారులు మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్‌కు వివరించారు. ఆయన స్వయంగా పరిశీలించి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. శనివారం జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, జాయింట్ కలెక్టర్ చంద్రుడు, సబ్‌కలెక్టర్ సృజన, ఇతర అధికారులు దుర్గాఘాట్ వద్ద కమాండ్ కంట్రోల్ రూమ్‌లో సమావేశమయ్యారు. కమిషనర్ కాంట్రాక్టర్‌ను పిలిపించి జిల్లా కలెక్టర్ ముందు నిలబెట్టాడు. కలెక్టర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పని చేయకుండా డబ్బులో కాజేయాలని చూస్తున్నారా..? అంటూ ప్రశ్నించారు. అటువంటి ట్రిక్‌లు ఎక్కడైనా జరుగుతాయోమో.. ఈ జిల్లాలో జరగదంటూ మండిపడ్డారు. పక్కనే ఉన్న డీఎస్పీని కార్పొరేషన్ వారు ఫిర్యాదు చేస్తారని, కాంట్రాక్టర్‌ను అరెస్ట్ చేయాలంటూ సూచించారు.