యాత్రాజినీ బిజినెస్ క్లాస్ క్యాబ్ సేవలు | YatraGenie introduces 'YG Elite'- business class cab service | Sakshi
Sakshi News home page

యాత్రాజినీ బిజినెస్ క్లాస్ క్యాబ్ సేవలు

Published Fri, Dec 25 2015 2:48 AM | Last Updated on Sun, Sep 3 2017 2:31 PM

యాత్రాజినీ బిజినెస్ క్లాస్ క్యాబ్ సేవలు

యాత్రాజినీ బిజినెస్ క్లాస్ క్యాబ్ సేవలు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యాత్రాజినీ సర్వీసెస్ వైజీ ఎలైట్ పేరుతో బిజినెస్ క్లాస్ క్యాబ్ సర్వీసులను దక్షిణాదిన 60 నగరాల్లో ప్రారంభించింది. ఖరీదైన ప్రయాణ అనుభూతి కోరుకునే వినియోగదార్ల కోసం ఈ సేవలను పరిచయం చేసినట్టు కంపెనీ సీఈవో రెనిల్ కోమిట్ల ఈ సందర్భంగా తెలిపారు. డిసెంబరు చివరినాటికి మొత్తం 100 నగరాల్లో అడుగు పెట్టాలన్నది లక్ష్యమని చెప్పారు. కస్టమర్లు యాత్రాజినీ యాప్‌లో వైజీ ఎలైట్‌ను ఎంచుకోవడం ద్వారా ఇన్నోవాను బుక్ చేయవచ్చు. మొదటి 8 కిలోమీటర్లకుగాను రూ.200 చార్జీ చేస్తారు. ప్రతి అదనపు కిలోమీటరుకు రూ.20 చెల్లించాలి.  బస్సు, హోటల్ గదుల బుకింగ్ సేవలను సైతం అందిస్తున్న ఈ కంపెనీ ఇటీవలే ఆటోరిక్షా సర్వీసులను ప్రారంభించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement