హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు | Flights From Hyderabad To Ayodhya | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు

Published Fri, Sep 27 2024 1:12 PM | Last Updated on Fri, Sep 27 2024 2:44 PM

Flights From Hyderabad To Ayodhya

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగరాజ్ ప్రాంతాలకు విమాన సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ - కాన్పూర్,  హైదరాబాద్-అయోధ్య మధ్యన వారానికి 4 రోజుల సర్వీసులు నడపనున్నారు. రేపటి(శనివారం) నుంచి హైదరాబాద్ - ప్రయాగరాజ్ మధ్యన, హైదరాబాద్-ఆగ్రా మధ్యన వారానికి 3 రోజుల సర్వీసును ప్రారంభించనున్నారు.

హైదరాబాద్ నగరం నుంచి  ఒక్క నెలలోనే 7 నూతన సర్వీసుల ప్రారంభం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి  కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నూతన సర్వీసులు ఆయా నగరాల మధ్యన ప్రయాణికుల డిమాండ్‌ను నెరవేరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కిషన్‌రెడ్డి ప్రయాణికులను కోరారు.

ఇదీ చదవండి: ఈ దుఃఖం తీర్చేదెవరు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement