మ్యూనిచ్ : అడాల్ఫ్ హిట్లర్.. ప్రపంచంలో ఈ పేరు తెలియనివారు ఉండరు. రెండో ప్రపంచ యుద్దం జరగడంలో ప్రధాన పాత్ర పోషించిన వారిలో హిట్లర్ కూడా ఒకరు. నాజీ వ్యవస్ధాపకుడైన హిట్లర్ జర్మనీకి ఒక నియంతలా వ్యవహరిస్తూ అందరి మాటను పెడచెవిన పెడుతూ తన చావును తానే కొనితెచ్చుకున్నాడు. హిట్లర్ ప్రవర్తనతో పాటు అతని ఆహార్యం కూడా వింతగానే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా ! ఏం లేదండి.. హిట్లర్ చనిపోయి 74 సంవత్సరాలు అయినా ఆయన ధరించిన కొన్ని వస్తువులు మాత్రం మ్యూనిచ్ ప్రాంతంలోని ఒక మ్యూజియంలో భద్రపరచారు.
తాజాగా హిట్లర్‌కు సంబంధించి ఆయన తరచూ ధరించే టోపీతో పాటు నాజీకి సంబంధించిన వస్తువులను బుధవారం ఆన్‌లైన్‌లో వేలం వేశారు. అయితే వీటిని చేజెక్కించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పోటీ పడ్డారు. కాని, స్విట్జర్లాండ్‌కు చెందిన అబ్దుల్లా చతీలా అనే వ్యాపారవేత్త హిట్లర్ ధరించిన టోపీని వేలంలో 50 వేల యూరోలకు (సుమారు రూ. 40లక్షలు) దక్కించుకున్నారు. అయితే దీనిని ఇజ్రాయెల్ నిధుల సేకరణ సంస్థ అయిన కెరెన్ హేసోడ్కుకు విరాళంగా ఇచ్చాడు. అయితే ఆఫర్‌లో ఉన్న మిగతా నాజీ వస్తువులను మాత్రం పొందలేకపోయాడు. కాగా, నాజీ వస్తువులను పొందడానికి ఇతరులు బారీ మొత్తంలోనే సమర్పించుకున్నట్లు తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment