కదులుతున్న రైలులో ఉగ్రవాది గొడ్డలితో దాడి చేసిన ఘటన మరువకముందే జర్మనీలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. దేశంలో మూడో అతిపెద్ద నగరం మ్యూనిచ్ లోని ఓ ఒలంపియా షాపింగ్ సెంటర్ లోకి చొరబడ్డ దుండగులు ఒక్కసారిగా కొనుగోలుదార్లపై కాల్పులకు తెగబడ్డాడు. ఇప్పటివరకు తెలిసిన సమాచారం మేరకు కాల్పుల్లో పలువురు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడినట్టు తెలిసింది. రంగంలోకి దిగిన పోలీసులు, భద్రతా సిబ్బంది షాపింగ్ సెంటర్ ను చుట్టుముట్టి దుండగులను మట్టుపేట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.