హిట్లర్ బొమ్మకు రూ.కోటి!
జర్మనీలోని మ్యునిచ్‌లో గల ఓల్డ్ సిటీ హాల్ (ఆల్టస్ రథౌస్)ను చిత్రిస్తూ రూపొందించిన 1914 నాటి వాటర్‌కలర్ పెయింటింగ్ ఇది. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తన యుక్తవయసులో చిత్రించిన ఈ పెయింటింగ్‌ను శనివారం నూరెంబర్గ్‌లో వేలం వేయగా రూ.99.32 లక్షలు పలికింది. దీన్ని కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలు వెల్లడి కాలేదు.