అవును నేను హిట్లర్నే... చంపడానికి సిద్ధం | Philippines Leader Likens Himself To Hitler, Wants To Kill Millions Of Drug Users | Sakshi
Sakshi News home page

అవును నేను హిట్లర్నే... చంపడానికి సిద్ధం

Published Fri, Sep 30 2016 12:14 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

అవును నేను హిట్లర్నే... చంపడానికి సిద్ధం

అవును నేను హిట్లర్నే... చంపడానికి సిద్ధం

మనీలా: ''డ్రగ్ బానిసలు, క్రిమినల్స్ లేని ఫిలిప్పీన్ నాలక్ష్యం. ప్రస్తుతం దేశంలో 30 లక్షల మంది డ్రగ్ బానిసలున్నారు. భవిష్యత్ తరాల సంక్షేమం కోసం వారినందరినీ చంపడానికైనా నేను సిద్ధమే''  అని ఫిలిప్పీన్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్ట్రె సంచలన వ్యాఖ్యలు చేశారు.  వియత్నాం పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం దావోస్ నగరంలో మీడియాతో మాట్లాడుతూ.. తనను జర్మనీ నియంత రుడాల్ఫ్ హిట్లర్ తో పోల్చడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

దేశ  భక్తి విషయంలో తాను హిట్లర్ కు సోదరుని లాంటి వానినని చెప్పుకొచ్చారు. జర్మనీలో హిట్లర్.. ఫిలిప్పీన్కు తానని అన్నారు. ఇప్పటివరకూ తమ దేశంలో చనిపోయిన వారందరూ క్రిమినల్సేనని స్పష్టం చేశారు. ఈ యేడాది మేలో పదివీ బాధ్యతలు చేపట్టిన రోడ్రిగో ప్రభుత్వం జూన్ 30 వరకు 3,100 మందిని  హతమార్చింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement