లగ్జరీ కార్లను నుజ్జునుజ్జు చేయించారు | Duterte Crushes Luxury Cars in Graft Warning | Sakshi
Sakshi News home page

లగ్జరీ కార్లను నుజ్జునుజ్జు చేయించారు

Published Wed, Feb 7 2018 7:55 PM | Last Updated on Wed, Feb 7 2018 7:55 PM

Duterte Crushes Luxury Cars in Graft Warning - Sakshi

బుల్డోజర్లతో తొక్కించడంతో నుజ్జయిన కార్లు

మనీలా, ఫిలిప్పీన్స్‌ : కేవలం మూడే మూడు నిమిషాల్లో అక్షరాల లక్షా పదిహేను వేల డాలర్లు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. దాదాపు రెండు డజన్ల లగ్జరీ కార్లను ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టె నుజ్జునుజ్జు చేయించారు. అవినీతిపై ఉక్కుపాదం మోపడంలో భాగంగా ఆయన  కఠిన నిర్ణయం తీసుకున్నారు.

పన్ను ఎగవేసి కొన్న లగ్జరీ కార్లను గతేడాది ఫిలిప్పీన్స్‌ అధికారులు పట్టుకున్నారు. సాధారణంగా ఇలా పన్ను ఎగవేసి దేశంలో నడుపుతున్న కార్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రత్యేక వేలంలో అమ్ముతుంది. వచ్చిన మొత్తాన్ని ఎగవేసిన సొమ్ముకింద జమ చేసుకుంటుంది.

అయితే, ఈ సారి అందుకు భిన్నంగా అధ్యక్షుడు డ్యుటెర్టె రైడింగ్‌లలో దొరికిన కార్లను బుల్‌డోజర్లతో తొక్కించారు. కార్లను తొక్కించగా మిగిలిన పార్ట్‌లతో బొమ్మలు చేయించాలని అధికారులను ఆయన ఆదేశించారు. డ్యుటెర్టె నుజ్జునుజ్జు చేయించిన వాటిలో పొర్చె, మెర్సిడెజ్‌, జాగ్వర్‌, కొర్వెట్టెస్ కంపెనీల కార్లు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement