విజయ్ ఆంటోనీ, రియా సుమన్ జంటగా నటించిన చిత్రం ‘హిట్లర్’. ధన దర్శకత్వంలో డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా త్వరలో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు.
‘‘ప్రజాస్వామ్యం పేరుతో కొందరు పాలకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. అలాంటి నియంతను ఎదుర్కొనే ఓ సాధారణ ΄పౌరుడి కథే ‘హిట్లర్’. ఈ మూవీలో లవ్ ట్రాక్‌కి కూడా ్రపాధాన్యత ఉంటుంది. యాక్షన్ థ్రిల్లర్ కథతో తీసిన ఈ ‘హిట్లర్’లో కిల్లర్‌గా విజయ్ ఆంటోని కొత్త లుక్‌లో, క్యారెక్టరైజేషన్‌లో కనిపిస్తారు’’ అని యూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment