హైదరాబాద్: విభజన చట్టాన్ని అంగీకరించిన టీఆర్ఎస్ పార్టీ.. అదే చట్టంలోని సెక్షన్- 8ను ఎందుకు వ్యతిరేకిస్తోందో చెప్పాలని ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత, రావెల కిశోర్ బాబులు నిలదీశారు. సెక్షన్-8 ను వ్యతిరేకించడం సరికాదని, ఈ విషయంలో నియంతృత్వపోకడను కనబరుస్తూ సీఎం కేసీఆర్ మరో హిట్లర్ లా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు.
మంగళవారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన మంత్రులు.. చట్టాన్ని వ్యతిరేకిస్తే కేసీఆర్ కు శిక్షతప్పదని హెచ్చరించారు. సెక్షన్-8తో ఉమ్మడి రాజధానిపై గవర్నర్కు ప్రత్యేక అధికారాలు సంక్రమిస్తాయని, అది ఆహ్వానించదగిందన్నారు. విభేదాలు తలెత్తినప్పుడే కాకుండా అన్నివేళలా బేషరతుగా సెక్షన్-8ని అమలుచేయాలని డిమాండ్ చేశారు.
'కేసీఆర్ మరో హిట్లర్'
Published Tue, Jun 23 2015 7:48 PM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM
Advertisement