section- 8
-
'సెక్షన్- 8తో ఏపీకి ఒరిగేదేమీ లేదు'
హైదరాబాద్: సెక్షన్- 8పై తెలుగుదేశం పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కొండ్రు మురళి మండిపడ్డారు. ఒకవేళ ఆ సెక్షన్ అమలయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ కు ఒరిగేదేమీలేదని, ఇక్కడి ప్రజలకు ఎలాంటి లాంభం కలగబోదని స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఓటుకు కోట్లు పంచి అవినీతి కేసుల్లో ఇరుక్కున్న చంద్రబాబుకు ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యంలేదని విమర్శించారు. -
'కేసీఆర్ మరో హిట్లర్'
హైదరాబాద్: విభజన చట్టాన్ని అంగీకరించిన టీఆర్ఎస్ పార్టీ.. అదే చట్టంలోని సెక్షన్- 8ను ఎందుకు వ్యతిరేకిస్తోందో చెప్పాలని ఏపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత, రావెల కిశోర్ బాబులు నిలదీశారు. సెక్షన్-8 ను వ్యతిరేకించడం సరికాదని, ఈ విషయంలో నియంతృత్వపోకడను కనబరుస్తూ సీఎం కేసీఆర్ మరో హిట్లర్ లా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. మంగళవారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన మంత్రులు.. చట్టాన్ని వ్యతిరేకిస్తే కేసీఆర్ కు శిక్షతప్పదని హెచ్చరించారు. సెక్షన్-8తో ఉమ్మడి రాజధానిపై గవర్నర్కు ప్రత్యేక అధికారాలు సంక్రమిస్తాయని, అది ఆహ్వానించదగిందన్నారు. విభేదాలు తలెత్తినప్పుడే కాకుండా అన్నివేళలా బేషరతుగా సెక్షన్-8ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబు అవినీతికి స్వేచ్ఛ కావాలా?
-
చంద్రబాబు అవినీతికి స్వేచ్ఛ కావాలా?
న్యూఢిల్లీ: 'ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛకు గొప్ప అర్థం ఉంది. టీడీపీ మంత్రులు మాట్లాడేది ఎలాంటి స్వేచ్ఛ గురించి? చంద్రబాబు విచ్చలవిడి అవినీతికి స్వేచ్ఛ కావాలా?' అని కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానిలో తమ స్వేచ్ఛకు భంగం కలుగుతోందని ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు గగ్గోలు పెట్టడం అర్థరహితమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో సెక్షన్- 8 అమలుచేయాల్సిన అవసరం లేదన్న వినోద్.. ఉమ్మడి రాజధానిలో విద్వేషాలు హెచ్చరిల్లినప్పుడుగానీ, పౌర హక్కులకు భంగం వాటిల్లడంకానీ, ఆస్తుల విధ్వంసం లేదా ఇతరత్రా హింసాయుత పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రమే విభజన చట్టంలోని సెక్షన్- 8 అమలుచేయాల్సి వస్తుందని, అదికూడా తెలంగాణ మంత్రివర్గాన్ని సంప్రదించిన తర్వాతే గవర్నర్ తుదినిర్ణయం తీసుకోవాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. ఓటుకు నోటు వ్యవహారం ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందికాబట్టి తెలంగాణ ఏసీబీ బాబుపై చర్య తీసుకోదని ఏపీ మంత్రులు వ్యాఖ్యానించడం వారి అజ్ఞానానికి నిదర్శనమని వినోద్ అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ చట్టం తన పని తాను చేసుకుపోవడం సహజమన్నారు.