
'ఇద్దరూ 420లు కాబట్టే అదేరోజు పుట్టారు'
హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ మండిపడింది. గోబెల్ ప్రచారం చేయడంలో జర్మనీ నియంత హిట్లర్ కు , చంద్రబాబుకు చాలా దగ్గర సంబంధాలున్నాయని వైఎస్సార్ సీపీ నేత ఒ.వి. రమణ విమర్శించారు. ఒకే రోజు పుట్టిన వీరిద్దరూ జాతి ద్రోహులేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇద్దరూ 420లు కాబట్టే అదే రోజు పుట్టారని రమణ వ్యాఖ్యానించారు. గోబెల్ ప్రచారం చేయడంలో ఇద్దరూ అందివేసిన చేయేనన్నారు.ప్రస్తుతం ఆ తరహా ప్రచారంతో ఆకట్టుకోవాలని చూస్తున్న బాబును ఎవరూ నమ్మే పరిస్థితి లేదని రమణ తెలిపారు.
తన మాటలు ప్రజలు నమ్మడం లేదనే ఉద్దేశంతోనే మరో కొత్త ప్రచారానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారన్నారు. జాతీయ ఛానల్స్ ను మేనెజ్ చేసి..తనకు అనుకూలంగా సర్వే ఫలితాలు వచ్చేలా చూసుకుంటున్నారన్నారు.