నా ఛాతీలో దమ్ముంది | Prabhas Eeshwar movie re release on his birthday | Sakshi

నా ఛాతీలో దమ్ముంది

Oct 14 2024 12:34 AM | Updated on Oct 14 2024 12:34 AM

Prabhas Eeshwar movie re release on his birthday

‘నా కలర్‌ నలుపు... కానీ, నా క్యారెక్టర్‌ ఎరుపు’ అంటూ నటుడు అశోక్‌ కుమార్‌ చెప్పే డైలాగ్‌తో ‘ఈశ్వర్‌’ సినిమా ట్రైలర్‌ ఆరంభమైంది. ప్రభాస్‌ హీరోగా పరిచయమైన చిత్రం ‘ఈశ్వర్‌’. జయంత్‌ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీదేవి విజయ్‌కుమార్‌ హీరోయిన్‌గా నటించారు. బ్రహ్మానందం, శివ కృష్ణ, రేవతి ఇతర పాత్రలు పోషించారు. కొల్ల అశోక్‌ కుమార్‌ నిర్మించిన ఈ సినిమా 2002 నవంబరు 11న రిలీజై హిట్‌గా నిలిచింది.

కాగా ఈ నెల 23న ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ‘ఈశ్వర్‌’ సినిమాని అదే రోజు 4కే క్వాలిటీలో రీ రిలీజ్‌ చేస్తోంది లక్ష్మీ నరసింహా మూవీస్‌. ఈ నేపథ్యంలో ఈ మూవీ రీ రిలీజ్‌ ట్రైలర్‌ని విడుదల చేశారు. రీ ఇంట్రడ్యూసింగ్‌ ప్రభాస్‌ అంటూ రిలీజ్‌ చేసిన ట్రైలర్‌ చూస్తే... ‘నీ చేతిలో డబ్బుంటే... నా ఛాతీలో దమ్ముంది రా, ఈ రోజు ఆ పోరి సంగతి అటో ఇటో తేల్చేస్తాను, ప్రేమించింది మర్చిపోవడానికి కాదు’ అంటూ ప్రభాస్‌ చెప్పే డైలాగులు ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: ఆర్పీ పట్నాయక్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement