టాలీవుడ్‌లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు అన్ని వారి వారి బర్త్‌డే సందర్భంగా మళ్లీ థీయేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. ఆ సినిమాలు విడుదలైనప్పుడు రానన్ని కలెక్షన్స్ రీరిలీజ్ టైమ్‌లో వస్తున్నాయంటే.. పాత సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తున్నారో తెలుసుకోవచ్చు. తాజాగా మహేశ్ బాబు మురారి సినిమా ఆయన బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 9న రీరిలీజై దాదాపు 7.32 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టి చరిత్ర సృష్టించింది.
అయితే పాత సినిమాలు మళ్లీ థియేటర్స్‌లోకి వచ్చి భారీగా కలెక్షన్స్ రాబట్టడం ఆశ్యర్యానికి గురి చేస్తుందని అంటున్నాడు మాస్ మహారాజా రవితేజ. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రీరిలీజ్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రీరిలీజ్ ట్రెండ్ మన(టాలీవుడ్) దగ్గరే ఉంది. నిజంగా మన ప్రేక్షకులను దేవుళ్లు అనొచ్చు. వాళ్లు సినిమాను ఎంతలా ప్రేమిస్తారో ఈ రీరిలీజ్ కలెక్షన్స్‌ని చూస్తే అర్థమవుతుంది. ఒక పాత సినిమాను మార్నింగ్ 6.30 థియేటర్స్‌కి వెళ్లి చూడడం ఆశ్యర్యంగా అనిపిస్తుంది.
అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు రిలీజ్ అయితే ఉదయం 7 గంటలకు వెళ్లి చూసేవాళ్లం. అవి కొత్త సినిమాలు కాబట్టి అంత మార్నింగ్ వెళ్లేవాళం. కానీ ఇప్పటి ప్రేక్షకులు ఉదయం 5 గంటలకే వెళ్లి చూస్తున్నారు. నిజంగా వాళ్లు చాలా గ్రేట్. ఇలాంటి పిచ్చి మనవాళ్లకు తప్ప ఎక్కడా లేదు’ అని రవితేజ అన్నారు. ఇక నీకు ఏ సినిమా రీరిలీజ్ కావాలని ఉంది అని యాంకర్ అడగ్గా.. అమితాబ్ బచ్చన్ ‘షోలే’ అని రవితేజ బదులిచ్చాడు. కాగా, గతంలో రవితేజ ‘విక్రమార్కుడు’, ‘వెంకీ’ సినిమాలు కూడా రీరిలీజై మంచి వసూళ్లను రాబట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment