22 ఏళ్ల తర్వాత కమల్‌హాసన్ సినిమా రిలీజ్ | Kamal Haasan Aalavandhan Movie Re Release After 22 Years | Sakshi
Sakshi News home page

Kamal Haasan: కమల్ సినిమా.. దాదాపు 22 ఏళ్ల తర్వాత విడుదల

Published Fri, Nov 17 2023 4:26 PM | Last Updated on Fri, Nov 17 2023 4:28 PM

Kamal Haasan Aalavandhan Movie Re Release After 22 Years - Sakshi

లోకనాయకుడు కమలహాసన్‌ నట విశ్వరూపానికి ఒక మచ్చుతునక 'ఆళవందాన్‌'. నిర్మాత కలైపులి ఎస్‌.థాను నిర్మించిన భారీ చిత్రమిది. సురేష్‌కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కమలహాసన్‌ కథను అందించారు. ఇదే మూవీలో హీరో కమ్ విలన్‌గా కమల్ ద్విపాత్రాభినయం చేశారు. సైకలాజికల్‌ స్టోరీతో తీసిన ఈ చిత్రం.. 2001 నవంబర్‌ 12న విడుదలైంది. కొన్ని కారణాల వల్ల అప్పట్లో హిట్ కాలేదు. 

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు)

ఈ సినిమాలో అన్నదమ్ములుగా కమలహాసన్‌ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. బాలీవుడ్‌ బ్యూటీస్‌ మనీషాకొయిరాల, రవీనా టాండన్‌ హీరోయిన్లుగా నటించారు. 22 ఏళ్ల క్రితం విడుదలైన ఆళవందాన్‌ చిత్రాన్ని నిర్మాత భాను ఇప్పుడు మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో ఇది 'అభయ్'‍ పేరుతో యూట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడీ చిత్రాన్నే చిన్నచిన్న మార్పులు చేసి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు పేర్కొని పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ మధ్యే కమలహాసన్‌ 'వేట్టైయాడు విళైయాడు' చిత్రం ఇటీవల మళ్లీ విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ఆ చిత్రానికంటే బెటర్‌గా ఆళవందాన్‌ చిత్రం కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంటుందని భావించవచ్చు.

(ఇదీ చదవండి: ఫౌల్ గేమ్ ఆడి దొరికిపోయిన శివాజీ.. మళ్లీ శోభాశెట్టితో పనికిరాని గొడవ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement