R Narayana Murthy's 'University' Movie Re-Release - Sakshi
Sakshi News home page

అందుకే మళ్లీ ‘యూనివర్సిటీ’ని రిలీజ్‌ చేస్తున్నా: ఆర్‌. నారాయణమూర్తి

Published Tue, Jul 11 2023 10:22 AM | Last Updated on Tue, Jul 11 2023 10:30 AM

R Narayana Murthy University Movie Re Release - Sakshi

‘‘విద్యార్థులు, నిరుద్యోగుల ఆవేదన, కష్టాలు, వారి తల్లిదండ్రుల కన్నీళ్లను ‘యూనివర్సిటీ’లో చూపించాను. వేసవి, వడగాల్పుల వల్ల ఈ చిత్రాన్ని ప్రేక్షకులు సరిగ్గా చూడలేకపోయారు.. అందుకే మళ్లీ విడుదల చేస్తే జనాలకు బాగా చేరువ అవుతుందని రిలీజ్‌ చేస్తున్నాను’’ అని ఆర్‌. నారాయణమూర్తి అన్నారు. ఆర్‌. నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సిటీ’ జూన్‌ 9న విడుదలైంది.

ఈ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ‘‘పదో తరగతి పేపరు లీకేజీలు, గ్రూప్‌ 1, 2లాంటి ఉద్యోగ పరీక్ష ప్రశ్నా పత్రాల లీకేజీలు జరుగుతుంటే విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్‌ ఏం కావాలి? అనే సందేశంతో ఈ సినిమా తీశాను. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాను’’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement