godari
-
ఓటీటీలో రిలీజవుతున్న ఆహా 'గోదారి'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ప్రస్తుత సినీరంగంలో ఓటీటీ హవా నడుస్తోంది. తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా మరో కొత్త కంటెంట్‌తో మీ ముందుకు వస్తోంది. గోదారి పేరుతో తెరకెక్కిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ఈనెల 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో గోదావరి నదీ అందాలను, విశేషాలను ప్రేక్షకులకు వివరించేలా స్వాతి దివాకర్ దర్శకత్వంలో డాక్యుమెంటరీని రూపొందించారు. దర్శకుడు దివాకర్ మాట్లాడుతూ.. 'ఆహా ఓటీటీ ద్వారా ఈ గోదారి డాక్యుమెంటరీని ప్రేక్షకులకు చూపించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇంతకుముందెన్నడూ చూడని గోదారి అందాలను ఈ డాక్యుమెంటరీలో చిత్రీకరించాం. గోదావరి నదీ విశిష్ణత, దాని చుట్టూ కోట్ల మంది ప్రజలు అవలంబించే సంస్కృతీ, సంప్రదాయాలు కళ్లకు కట్టినట్టు ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నాం.' అని అన్నారు. ఈ ఆహా గోదారి డాక్యుమెంటరీ ఆహా ఓటీటీలో మైలురాయిగా నిలవనుంది. ఇలాంటి డాక్యుమెంటరీలతో మన సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాచీన కట్టడాల గురించి ప్రేక్షకులకు వివరించే అవకాశం ఉంటుందని ఆహా యాజమాన్యం తెలిపింది. త్రింబకేశ్వర్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ చివరికి అంతర్వేది దగ్గర సాగరంలో కలుస్తుంది మన గోదారి. తన ప్రవాహ ప్రయాణంలో వివిధ రకాల ప్రాంతాలు, మనుషులు, యాసలు, భాషలు, పుణ్యక్షేత్రాలను పలకరిస్తూ, పరవశిస్తూ వారి జీవితాల్లో ముఖ్య భూమిక పోషిస్తోందని -
ఆయ్.. మేం గోదారోళ్ల మండి.. యూకేలో గోదారోళ్ల సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి అంటేనే గోదారి జిల్లాలు… గోదారోళ్లు అంటేనే సంక్రాంతికి ప్రతీకలు... అందునా కోనసీమ వాళ్లయితే మరీనూ.. సంక్రాతిని తమ జీవితం నుంచి వడదీసి చూడటానికి ఏమాంత్రం ఇష్టపడరు. అందుకే ఉద్యోగం, వ్యాపారం అంటూ ఖండాంతరాలు దాటినా సంక్రాంతి పండగుపై మమకారం ఎక్కవైతుందే తప్పా.. ఎక్కడ తగ్గట్లేదు. అలాంటి సంక్రాంతి సంబరాలు యూకేలో ఘనంగా జరిగాయి. మాది యునైటెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ గోదావరి అని ముద్దుగా చెప్పుకునే యుకే గోదారోళ్ళు సంక్రాంతి సంబరాలు లండన్‌లో జనవరి 21న అంబరాన్ని అంటేలా నిర్వహించారు. చిన్న పిల్లలకు భోగి పళ్ళతో మొదలుకొని, గొబ్బిళ్ళు పాటలతో, స్వయంగా తామే వండి వడ్డించిన అరిటాకులో విందు భోజనం, తెలుగు సంస్కృతిని, గోదావరి వెటకారాన్ని, యాసని గుర్తు చేస్తూ ఆట పాటలు, తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ఆద్యంతం ఆసక్తికరంగా నిర్వహించడం స్థానికుల్ని సైతం అబ్బుర పరిచింది. గోదావరి ప్రాంత సాంప్రదాయ వంటకాలతో పసందైన విందుతో రుచులను ఆస్వాదించారు. వచ్చిన ఆడపడుచులు అందరినీ పసుపు కుంకాలతో ఆహ్వానించి, జీడ్లు, రేగి వడియాలు, ఒక సర్ప్రైజ్ స్వీట్ సారెగా ఇచ్చి సాగనంపారు. యూకేలోని సుమారు 1500 పైగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలే కాక, తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని నిర్వాహకులు తెలిపారు. -
పెరుగుతున్న గోదారి
తాలిపేరు నుంచి బ్యాక్‌వాటర్ చర్ల: సరిహద్దు ఛత్తీస్గడ్ రాష్ట్రంతో పాటు గోదావరి ఎగువ ప్రాంతం మహారాష్ట్రాలో నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది వరద ఉధృతి పెరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాలోని అటవీప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు పెదమిడిసిలేరు సమీపంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో మూడురోజులుగా పెద్ద ఎత్తున వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు తాలిపేరు నీరు.. అటు గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరదనీటితో ఆదివారం రాత్రి నుంచి నదిలో వరద ఉధృతి బాగా పెరుగుతోంది. మండలంలోని తేగడ వద్ద తాలిపేరు వాగు, కుదునూరు సమీపంలోని జోడిచీలికల వాగు ద్వారా గోదావరి బ్యాక్‌వాటర్ వచ్చి వాగులో చేరుతోంది. ఆయా వాగుల సమీపంలోని వరి, మిర్చి, పత్తి పంటలు సాగు చేస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. వరద ఉధృతి పెరిగితే పంటలు నీటముగినే ప్రమాదం ఉండటంతో రైతులు మరింతగా ఆందోళన చెందుతున్నారు. తాలిపేరు వాగు ద్వారా వచ్చిన బ్యాక్‌వాటర్‌తో తేగడలో తాలిపేరు వాగుపై ఉన్న లోలెవల్ చప్టా నీటమునిగే అవకాశం ఉంది.