
జియాఖాన్
జియాఖాన్ జీవితకథపై బ్రిటిష్ నిర్మాత ఒకరు డాక్యుమెంటరీ తీయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. సహనటుడు సూరజ్ పంచోలీతో తెగిపోయిన బంధం ఆమెను మరణానికి చేరువ చేసింది. 2013లో జియా ఆత్మహత్య చేసుకున్నారు. పాతికేళ్ల వయసులో చనిపోయిన జియా జీవితంలో ఆమె బతికిన క్షణాలకన్నా, చావలేక బతికిన క్షణాలే ఎక్కువ కనుక బ్రిటిష్ నిర్మాత తీయబోయే జియా డాక్యుమెంటరీ ఆమె ఆత్మహత్య చుట్టూ తిరుగుతుందా, లేక ఆత్మహత్యను వదిలేసి తిరుగుతుందా అనేది కూడా స్పష్టం కావలసి ఉంది. న్యూయార్క్‌లో పుట్టి, లండన్‌లో పెరిగి, పాకిస్థాన్‌లో సమీప బంధువులున్న జియాఖాన్.. రామ్‌గోపాల్ వర్మ తీసిన ‘నిశ్శబ్ద్’ (2017) చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. అందులో ఆమె అమితాబ్‌తో కలిసి నటించారు. తర్వాత ఘజనీ, హౌస్‌ఫుల్ చిత్రాలలో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment