అమరావతిపై డాక్యుమెంటరీ | Documentary Film on Amravati construction | Sakshi
Sakshi News home page

అమరావతిపై డాక్యుమెంటరీ

Published Wed, Sep 16 2015 2:42 AM | Last Updated on Sat, Aug 18 2018 3:49 PM

అమరావతిపై డాక్యుమెంటరీ - Sakshi

అమరావతిపై డాక్యుమెంటరీ

సాక్షి, హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను రూపొందించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. అమరావతి సంస్కృతి, చరిత్రతోపాటు నిర్మాణ దృశ్యాలు, అభివృద్ధిని చిత్రీకరించనున్నారు. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపకల్పన బాధ్యతలను నేషనల్ జియోగ్రఫిక్ చానల్‌కు అప్పగించాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది. సదరు చానల్ ప్రతినిధులతో జరిపిన చర్చలు ఫలిం చాయి. 44 నిమిషాల నిడివి ఉండే ఈ ఫిల్మ్ చిత్రీకరణకు రూ. 48 లక్షలు వ్యయం చేయనున్నారు. మూడు నాలుగేళ్లపాటు రోజుకు 60 షాట్స్ చిత్రీకరిస్తారు.

డాక్యుమెంటరీపై యాజమాన్య హక్కు సీఆర్‌డీఏకు ఉంటుంది. అమరావతిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు దేశ విదేశాల్లో ఈ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు. దీనిద్వారా పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించవచ్చని సీఆర్‌డీఏ అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement