
గుంటూరు: సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ ఎస్పీ కేజీవీ సరిత ఆధ్వర్యంలో నూతనంగా రూపొందుతున్న ‘బీఅలర్ట్’ డాక్యుమెంటరీ షూటింగ్ మంగళవారం సూర్యలంక బీచ్‌లో దర్శకుడు, సీఐడీ ఎస్‌ఐ కొట్టె శ్రీహరి పర్యవేక్షణలో జరిగింది. యువత బీచ్‌లకు వెళ్ళి వ్యసనాలకు బానిసలుగా మారడం, పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం పై చిత్రీకరణ జరిగింది. సన్ని వేశాల్లో సీఐడీ ఎస్‌ఐ రామకోటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, నటీనటులు జెస్సీ హారిక, సాయినా«థ్ తదితరులు పాల్గొన్నారు.