
‘మోతీ భాగ్’లో ఓ దృశ్యం
ప్రస్తుత కాలంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ల సమస్యలేంటి? ఎందుకు వలస వెళ్లిపోతున్నారనే నేప థ్యంలో రూపొందిన డాక్యుమెంటరీ చిత్రం ‘మోతీ భాగ్’. ఉత్తరాఖండ్‌లో నివసించే విద్యుత్ అనే రైతు జీవితం ఆధారంగా దర్శకుడు నిర్మల్ చందర్ దండ్రియాల్ ఈ డాక్యుమెంటరీ రూపొందించారు. ఈ డాక్యుమెంటరీ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అయిందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఇటీవల ప్రకటించారు. ‘‘ఇలాంటి సినిమాలే యువతను తమ ప్రాంతాల్లోనే ఉండేలా ప్రేరణనిస్తాయి. వలసలు వెళ్లిపోవడాన్ని కూడా తగ్గిస్తాయి. ‘మోతీ భాగ్’ టీమ్‌కు కంగ్రాట్స్’ అని పేర్కొన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment