
బ్యాంగ్ బ్యాంగ్ సీక్వెలో అలరించనున్న హృతిక్, కత్రినా
సాక్షి, ముంబయి : బ్యాంగ్ బ్యాంగ్ మూవీలో అలరించిన గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, కత్రినాల జోడీ మరోసారి ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. 2014లో విడుదలైన బ్యాంగ్ బ్యాంగ్‌కు తెరకెక్కనున్న సీక్వెల్‌లో వీరిద్దరూ మరోసారి ఆన్‌స్ర్కీన్ కెమిస్ర్టీని పండించనున్నారు. బ్యాంగ్ బ్యాంగ్ రీలోడెడ్ పేరిట రూపొందే ఈ మూవీ పనులను చేపట్టేందుకు ఫాక్స్ స్టార్ హిందీ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
అయితే ఒరిజినల్‌కు సీక్వెల్‌గా దీన్ని రూపొందించరాదని మేకర్లు యోచిస్తున్నారు. బ్యాంగ్ బ్యాంగ్ ఫ్రాంచైజీకి దర్శకుడిని ఇంకా ఎంపిక చేయలేదని డైరెక్టర్‌ను ఖరారు చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిసింది. హాలీవుడ్ సూపర్‌హిట్ నైట్ అండ్ డేకు అధికారిక రీమేక్‌గా తెరకెక్కిన బ్యాంగ్ బ్యాంగ్‌కు సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.
Comments
Please login to add a commentAdd a comment