బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, రుమేనియా బ్యూటీ లూలియా వంటూర్‌ల లవ్‌కి ఫుల్‌స్టాప్ పడిందా? ఎవరి దారి వారు చూసుకున్నారా? లూలియా తన దేశం వెళ్లిపోయారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఆ మధ్య సల్మాన్–లులియా చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. ఇటీవల ఈ ప్రేమపక్షులు ఎక్కడా కనిపించడం లేదు. దాంతో ప్రేమకి ఫుల్‌స్టాప్ పడ్డట్టేనని, అందుకే లూలియా రుమేనియా వెళ్లిపోయారని కొందరు అంటుంటే... లూలియా వీసా గడువు ముగియడంతోనే స్వదేశం వెళ్లారని మరికొందరు అంటున్నారు.
కాగా, వీరిద్దరి లవ్ బ్రేకప్‌కి సల్మాన్ మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్ కారణం అని బిటౌన్ గుసగుస. సల్మాన్‌తో బ్రేకప్ అయ్యాక రణ్‌బీర్ కపూర్‌తో లవ్‌లో పడ్డారు కత్రినా. అయితే, ‘టైగర్ జిందా హై’ చిత్రీకరణ సమయంలో సల్మాన్, కత్రినాల మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందట. ఇది తెలిసే లూలియా రుమేనియా వెళ్లిపోయారని సమాచారం. నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. మరి, సల్మాన్–లూలియాల విషయంలో వాస్తవాలేంటో తెలియాలంటే వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment