luliya vantur
-
సల్మాన్.. కత్రినా.. ఓ లూలియా!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, రుమేనియా బ్యూటీ లూలియా వంటూర్ల లవ్‌కి ఫుల్స్టాప్ పడిందా? ఎవరి దారి వారు చూసుకున్నారా? లూలియా తన దేశం వెళ్లిపోయారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ఆ మధ్య సల్మాన్–లులియా చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. ఇటీవల ఈ ప్రేమపక్షులు ఎక్కడా కనిపించడం లేదు. దాంతో ప్రేమకి ఫుల్స్టాప్ పడ్డట్టేనని, అందుకే లూలియా రుమేనియా వెళ్లిపోయారని కొందరు అంటుంటే... లూలియా వీసా గడువు ముగియడంతోనే స్వదేశం వెళ్లారని మరికొందరు అంటున్నారు. కాగా, వీరిద్దరి లవ్ బ్రేకప్‌కి సల్మాన్ మాజీ ప్రియురాలు కత్రినా కైఫ్ కారణం అని బిటౌన్ గుసగుస. సల్మాన్‌తో బ్రేకప్ అయ్యాక రణ్‌బీర్ కపూర్‌తో లవ్‌లో పడ్డారు కత్రినా. అయితే, ‘టైగర్ జిందా హై’ చిత్రీకరణ సమయంలో సల్మాన్, కత్రినాల మధ్య మళ్లీ ప్రేమ చిగురించిందట. ఇది తెలిసే లూలియా రుమేనియా వెళ్లిపోయారని సమాచారం. నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. మరి, సల్మాన్–లూలియాల విషయంలో వాస్తవాలేంటో తెలియాలంటే వేచి చూడాలి. -
ఈ మోడల్‌తో సల్మాన్ పెళ్ళి లేనట్లే!
‘నవంబర్ 18న పెళ్లి చేసుకుంటా’ అంటూ ఓ సందర్భంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ప్రకటించడంతో ఆయన అభిమానులు సంబరపడిపోయారు. రుమేనియాకు చెందిన మోడల్ లూలియా వంటుర్‌తో సల్మాన్ ప్రేమలో ఉండటం, ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం, వీరిద్దరికీ రహస్యంగా నిశ్చితార్థం కూడా అయిందనే వార్తలు రావడంతో ఈ ఏడాదే వారు పెళ్లి పీటలు ఎక్కుతారనుకున్నారంతా. నవంబర్ రానే వచ్చింది. 18వ తారీఖు కూడా దగ్గర పడుతోంది. అయితే సల్లూ అభిమానులకు మళ్లీ నిరాశ, ఎదురు చూపులు తప్పేలా లేవు. సల్మాన్, లూలియా విడిపోయారన్నది ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్. లూలియాకు ఆల్రెడీ పెళ్లి అయిందంటూ ఆమె భర్తతో కలిసి దిగిన ఫొటోలు కొద్దిరోజులు హల్చల్ చేశాయి. ఆ తర్వాత కూడా సల్లూ, ఈ అమ్మడు కలిసి దర్శనమివడంతో కలిసే ఉన్నారనుకున్నారంతా. కానీ, ఏం జరిగిందో ఏమో ప్రేమకు బ్రేకప్ చెప్పేశారనీ, దాంతో లూలియాముంబై వదిలి తన సొంత దేశం రుమేనియాకు వెళ్లిపోయారని సమాచారం. మొత్తానికి లూలియాతో, సల్మాన్ పెళ్ళి లేనట్లే.