
Kiara Advani Comments On Katrina And Vicky Wedding: బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ వివాహం ప్రస్తుతం బీటౌన్ హాట్ టాపిక్ అని తెలిసిన సంగతే. వీరిద్దరూ డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార‍్వారాలో పెళ్లి చేసుకోబోతునట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వివాహం కోసం ఏర్పాట్లు కూడా జోరుగా సాగుతున్నాయని ప్రచారం సాగుతోంది. అయితే ఈ వివాహం గురించి ఇటు కత్రీనా, అటు విక్కీ అధికారికంగా పెదవి విప్పలేదు. వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా ధ‍్రువీకరించలేదు. ఇదిలా ఉంటే వీరి షాదీకి హాజరయ్యేవారు ఎవరెవరూ అనేది ఇంకో టాపిక్‌గా మారింది.
అయితే క‍్యాట్, విక్కీ వివాహంపై బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. శుక్రవారం (డిసెంబర్ 3) ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వారి పెళ్లి గురించి అడిగితే కియార మొదట ఆశ్చర్యపోయింది. 'నిజంగానా ? వార్తలు విన్నాను, కానీ నాకేం తెలీదు. నన్నైతే ఇప్పటివరకు ఆహ్వానించలేదు.' అని చెప్పుకొచ్చింది 'కబీర్ ఖాన్' ముద్దుగుమ్మ. అలాగే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, అతని సోదరీమణులు అల్విరా, అర్పిత, వారి కుటుంబ సభ్యులు కత్రీనా, విక్కీల వివాహం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. వారికి కూడా ఇంతవరకూ ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.
మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా ప్రాంతమంతా భద్రతను కట్టుదిట్టం చేసి, ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారని సమాచారం. డిసెంబర్ 4 నుంచి 12 మధ్య వివాహ కార్యక‍్రమాలు నిర‍్వహించే అవకాశం ఉందట. డిసెంబర్ 7న 'సంగీత్', మరుసటి రోజు 'మెహందీ' కాగా పెళ్లి తర్వాత ఈ నెల 10న ప్రత్యేక రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వివాహ వేడుకకు సుమారు 120 మంది బాలీవుడ్ పెద్దలు అతిథులుగా విచ్చేయనున్నారని సమాచారం.
ఇదీ చదవండి: విక్కీ-కత్రినాల వివాహం.. సల్మాన్ రియాక్షన్ ఇలా ఉంటుందా..!
Comments
Please login to add a commentAdd a comment