ఒకప్పుడు దేశాన్ని ఓ ఊపు ఊపిన వాన పాట ‘టిప్ టిప్ బర్సా పానీ’. 1994లో విడుదలైన 'మోహ్రా' చిత్రం కోసం అక్షయ్ కుమార్‌తో కలిసి రవీనా టాండన్ దుమ్ములేపారు. ఈ ఐకానిక్ పాట చిత్రీకరించడం గురించి ఆమె తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
(ఇదీ చదవండి: రాఘవేంద్ర రావు చెంప చెళ్లుమనేలా కౌంటర్లు ఇస్తున్న నెటిజన్లు)
నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌లో ఆ పాటను షూట్ చేయడంతో చాలా ఇబ్బంది పడినట్లు రవీనా చెప్పుకొచ్చింది. అక్కడ చుట్టూ ఇనుప చువ్వలతో పాటు అపరిశుభ్రంగా ఉంది. దీంతో పాట చిత్రీకరణలో తాను ఎంతో ఇబ్బంది పడినట్లు రవీనా తెలిపింది. అంతేకాకుండా చెప్పులేకుండా చీర ధరించి వర్షంలో అలాంటి మూమెంట్స్ చేయడం చాలా కష్టమనిపించినట్లు చెప్పింది. షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఇంటికి వెళ్లి చూసుకుంటే మోకాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. అప్పుడు ఆ బాధను భరిచలేకపోయానని తెలిపింది. దీంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లి టీటీ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది.
(ఇదీ చదవండి: భక్త కన్నప్పలో ప్రభాస్.. అదిరిపోయే అప్‌డేట్)
ఆ పాట దెబ్బతో సుమారు మూడు రోజులకు పైగానే అనారోగ్యానికి గురికావడం జరిగిందని గుర్తుచేసుకుంది. తెరపై ప్రేక్షకులు చూసే గ్లామర్... తెరవెనుక చెప్పలేనన్ని కథలను దాచిపెడుతుంది. రిహార్సల్స్ సమయంలో గాయాలు మామూలే, అయినా తామందరం వాటిని సహిస్తామని తెలిపింది. పాట చిత్రీకరణ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడినా అదీ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌తో ఆ బాధలన్నీ మరిచిపోయామని రవీనా టాండన్ చెప్పింది. ఇదే పాటను 2021లో విడుదలైన ‘సూర్యవంశీ’ సినిమాలో కూడా రీమేక్ చేశారు. అందులో అక్షయ్‌కుమార్ - కత్రినాకైఫ్ నటించారు.
Comments
Please login to add a commentAdd a comment