షారుక్ ఖాన్
షారుక్ ఖాన్ తన బర్త్‌డే సందర్భంగా సినిమా అభిమానులందరికీ మంచి ట్రీట్ ప్లాన్ చేశారు. తన లేటెస్ట్ మూవీ ‘జీరో’ సినిమా ట్రైలర్‌ను ఆయన బర్త్‌డే నవంబర్ 2న రిలీజ్ చేయనున్నారట. షారుక్ ఖాన్ హీరోగా ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జీరో’. ఇందులో షారుక్ మరుగుజ్జు పాత్రలో కనిపించనున్నారు. అనుష్కా శర్మ, కత్రినా కైఫ్ హీరోయిన్లుగా నటించారు. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన రెండు టీజర్స్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. టైటిల్ అనౌన్స్‌మెంట్, ఈద్ సందర్భంగా రిలీజ్ చేసిన ఈ టీజర్స్ సినిమాపై మంచి అంచనాలను ఏర్పరచాయి. ‘జీరో’ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment