
సాక్షి, ముంబై: బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్‌కు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో వరుస పోస్టులతో అభిమానులతో టచ్‌లో ఉంటుంది ఈ భామ. తాజాగా ఈ ముద్దుగుమ్మ పెట్టిన ఓ వీడియో హల్‌చల్ చేస్తోంది. షూటింగ్ సమయంలో తీసిన వీడియోను కత్రినా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అయితే, ఈ షూటింగ్ సినిమా కోసమా లేదా. ఏదైనా టీవీ యాడ్ కోసమా అన్నది స్పష్టత లేదు.
షూట్ లైఫ్ అంటూ కత్రినా పెట్టిన ఈ వీడియోను బట్టిచూస్తే ఇది ఓ వాణిజ్య ప్రకటనకు చిత్రీకరణకు సంబంధించిందై ఉండొవచ్చునని భావిస్తున్నారు. స్కైబ్లూ టాప్, డెనిమ్ జీన్స్ వేసుకొని హాట్ హాట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఈ వీడియోలో కత్రినా అదరగొట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ వీడియోకు ఇప్పటికే లక్ష70వేలకుపైగా లైకులు వచ్చాయి.