మోసపోయిన టాలీవుడ్‌ హీరోయిన్‌.. రూ.4 కోట్లు కాదు రూ.14 కోట్లు! | Rimi Sen Duped By Close Friend For Rs 4 Crore, Case Transferred To CID | Sakshi
Sakshi News home page

ఎంతో నమ్మా.. ఇలా మోసం చేస్తాడనుకోలేదు.. వడ్డీతో సహా కక్కాల్సిందే!

Published Wed, Jun 19 2024 6:17 PM | Last Updated on Wed, Jun 19 2024 6:25 PM

Rimi Sen Duped By Close Friend For Rs 4 Crore, Case Transferred To CID

ఫ్రెండ్‌ అని నమ్మితే నిలువునా మోసం చేశాడంటోంది హీరోయిన్‌ రిమి సేన్‌. మాయమాటలు చెప్పి ఫ్రెండ్‌గా దగ్గరై.. డబ్బులిచ్చాక కనబడకుండా పారిపోయాడని వాపోయింది. రూ.4.14 కోట్లు తీసుకుని మోసం చేశాడంటూ తన ఫ్రెండ్‌ రోనక్‌ వ్యాస్‌పై రెండేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది రిమి సేన్‌. తాజాగా ఈ కేసు సీఐడీకి బదిలీ అయింది.

ఇంటికి వచ్చి..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం జిమ్‌లో రోనక్‌ను కలిశాను. మంచి ఫ్రెండయ్యాడు. తనతో స్నేహం చేశాను. కానీ నన్ను మోసం చేశాడు. అహ్మదాబాద్‌లోనూ ఇలాగే చాలామందిని మోసం చేశాడని విన్నాను. తను నా ఇంటికి కూడా వచ్చాడు. మా అమ్మతో కలిసి తిన్నాడు. అంత క్లోజ్‌గా ఉన్న వ్యక్తి తర్వాత సడన్‌గా ప్లేటు తిప్పేశాడు. అధిక వడ్డీ అని చెప్పి నా దగ్గరి నుంచి రూ.20 లక్షలు తీసుకున్నాడు. దానిపై తొమ్మిది శాతం వడ్డీ ఇచ్చేవాడు. 

ఒక్క నెల మాత్రమే..
ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తే దానిపై 12- 15 శాతం వడ్డీ తీసుకొస్తానన్నాడు. అలా రూ.4.14 కోట్లు ఇచ్చాను. మొదటి నెల ఐదారు లక్షలు చేతికిచ్చాడు. తర్వాత వాళ్ల నాన్నకు కరోనా వచ్చిందని, డబ్బులు ఇవ్వలేనని చెప్పేసరికి నమ్మేశాను. నెలల తరబడి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవడంతో ఇదంతా స్కామ్‌ అని అర్థమైంది. ఏడాదిన్నర క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇప్పుడా కేసు సీఐడీకి బదిలీ అయినట్లు ఫోన్‌ వచ్చింది. 

వడ్డీతో సహా..
కేసు త్వరితగతిన విచారణ చేపట్టాలని హైకోర్టులో పిటిషన్‌ వేశాను. బహుశా రెండురోజుల్లో అరెస్ట్‌ వారంట్‌ జారీ చేస్తారు. నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. వడ్డీతో సహా నాకు రూ.14 కోట్లు రావాల్సి ఉంది. పోలీసులకు లొంగిపోయుంటే నేను ఇచ్చిన అసలు మాత్రమే  తీసుకుని వదిలేసేదాన్ని. కానీ ఇప్పుడు కనిపించకుండా పారిపోయాడు.. కాబట్టి నేను ఎంతదూరమైనా వెళ్తాను అని రిమి సేన్‌ చెప్పుకొచ్చింది. కాగా రిమి సేన్‌.. నీ తోడు కావాలి, అందరివాడు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.

చదవండి: అభిమాని కుటుంబాన్ని ఆదుకున్న మహేశ్‌ బాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement