సాక్షి, ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు భారీ షాక్ తగిలింది.ఇన్ఫోసిస్ మాజీ సీనియర్ ఉద్యోగి, జిల్ ప్రీజీన్ ఆరోపణలను కొట్టి వేయాలని ఇన్ఫోసిస్ దాఖలు చేసిన పిటిషన్‌ను అమెరికా కోర్టు తాజాగా తిరస్కరించింది. అమెరికా నియామకాల్లో వయస్సు, లింగ, జాతి వివక్ష చూపారని ఆమె ఇన్ఫోసిస్‌పై దావా వేశారు. (Hong Kong టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన టికెట్లు ఫ్రీ)
కంపెనీలోని సీనియర్ సిబ్బంది వయస్సు, లింగం, జాతి ఆధారంగా నియామకాల్లో వివక్షతో, పక్షపాతంగా వ్యహరించారంటూ గత ఏడాది అమెరికా కోర్టులో జిల్ ప్రీజీన్ ఫిర్యాదు చేశారు. ఈ పద్ధతి జాతి వివక్ష, చట్టవిరుద్ధమని వాదించినందుకు ఒత్తిడికి, వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఇన్ఫోసిస్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కన్సల్టింగ్ హెడ్ మార్క్ లివింగ్‌స్టన్, అప్పటి ప్రీజీన్ పార్టనర్స్ డాన్ ఆల్బ్రైట్, జెర్రీ కర్ట్జ్‌లపై కేసు నమోదైంది. అయితే దీనిపై ఇన్ఫోసిస్ స్పందనను కోర్టు తాజాగా తోసిపుచ్చింది. ప్రీజీన్ చేసిన క్లెయిమ్‌లను విచారణకు స్వీకరిస్తూ, న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్‌లోని యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి ఇన్ఫీ వాదనను తిరస్కరించారు. అంతేకాదు ఈ ఆరోపణలపై వచ్చే 21 రోజుల్లోగా తమ స్పందనను తెలియ జేయాలని కూడా ఆదేశించింది. దీనిపై ఇన్ఫోసిస్ ఇంకా స్పందించాల్సి ఉంది.
కాగా ఇన్ఫీలో టాలెంట్ అక్విజిషన్ వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్‌లను రిక్రూటింగ్ నిపుణురాలు జిల్ ప్రీజీన్ ఈ కేసు వేశారు. భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులు, ఇంట్లో పిల్లలున్న మహిళలతోపాటు 50 ఏళ్లు పైబడిన అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆంక్షలు విధించారని జిల్ ఆరోపించారు. నియామకాల్లో వివక్ష చూపేలా తనపై ఒత్తడి చేశారని ఆమె ఆరోపించారు. వీటిని వ్యతిరేకించినందుకు తనను ఉద్యోగం నుంచి తొలగించి ప్రతీకారం తీర్చు కున్నారనేది జిల్ ఆరోపణ. ఇది న్యూయార్క్ నగర మానవ హక్కుల చట్టాల ఉల్లంఘన అంటూ జిల్ ప్రిజీన్ సెప్టెంబర్ 2021లో తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నైట్స్ ఖండన
మరోవైపు ఆధునిక యుగంలో జాతి, లింగం, వయసు ఆధారిత వివక్ష ఇది తీరని విషాదమంటూ నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (నైట్స్)ఇన్ఫోసిస్ తీరును తప్పుబట్టింది. పని చేయాలనే కోరిక జీవితాన్ని విలువైనదిగా మారుస్తుందని అలాంటి ప్రయత్నాలను అడ్డు కోవడం నేరమని వ్యాఖ్యానించింది.
#Discrimination due to age is one of the great tragedies of modern life. The desire to work and be useful is what makes life worth living, and to be told your efforts are not needed because you are the wrong age is a crime.#ITEmployees #StrongerTogether #JusticeforEmployees pic.twitter.com/X7dDBTOQ5R
— Nascent Information Technology Employees Senate (@NITESenate) October 8, 2022
Comments
Please login to add a commentAdd a comment