former employee
-
Shradha Khapra: సలహాల అక్క
శ్రద్ధా కాప్రాను అందరూ ‘మైక్రోసాఫ్ట్ వాలీ దీదీ’ అని పిలుస్తారు. శ్రద్ధ బంగారంలాంటి మైక్రోసాఫ్ట్ ఉద్యోగాన్ని వదిలేసింది. ‘యువత కెరీర్ కోసం గైడెన్స్ అవసరం’ అని ‘అప్నా కాలేజ్’ పేరుతో ఓ యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది. రెండేళ్లలో 40 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ అయ్యారు. మైక్రోసాఫ్ట్ జీతం కన్నా ఎన్నో రెట్ల ఆదాయం శ్రద్ధకు వస్తోంది. ఏ కోర్సు చదవాలి, ఏ ఉద్యోగం చేయాలి లాంటి సలహాలు ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగినట్టు ఇవ్వడమే శ్రద్ధ సక్సెస్‌కు కారణం. ‘హరియాణలోని చిన్న పల్లెటూరు మాది. మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగైనా నేను ఏం చదవాలో గైడ్ చేయడం ఆయనకు తెలియదు. టీచర్లు కూడా గైడ్ చేస్తారనుకోవడం అంత కరెక్ట్ కాదు. ఇప్పటికీ కాలేజీ స్థాయి నుంచి యువతకు తమ కెరీర్ పట్ల ఎన్నో డౌట్లు ఉంటాయి. వారికి గైడెన్స్ అవసరం. ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుని గైడ్ చేయాలి. నేను కొద్దోగొప్పో చేయగలుగుతున్నాను కాబట్టే ఈ ఆదరణ’ అంటుంది శ్రద్ధా కాప్రా. ఈమెకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు ఈనాటి కాలేజీ విద్యార్థుల్లో. ముఖ్యంగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌లో. వీరంతా శ్రద్ధను ‘శద్ధ్రా దీదీ’ అని,‘మైక్రోసాఫ్ట్ వాలీ దీదీ’ అని పిలుస్తారు. ఆమె చేసే వీడియోలను వారు విపరీతంగా ఫాలో అవుతారు. ఆ వీడియోల్లో ఆమె చెప్పే సలహాలను వింటారు. డాక్టర్ కాబోయి... శ్రద్ధ తన బాల్యంలో టీవీలో ఒక షో చూసేది. అందులో డాక్టర్లు తాము ఎలా క్లిష్టమైన కేసులు పరిష్కరించారో చెప్పేవారు. ఆ షో చూసి తాను డాక్టర్ కావాలనుకుని ఇంటర్లో ‘పిసిఎంబి’ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్, బయాలజీ) తీసుకుంది. కాని జూనియర్ ఇంటర్ పూర్తయ్యే సరికి డాక్టర్ కావడం చాలా కష్టమని అర్థమైంది. అందుకే మేథ్స్వైపు దృష్టి సారించింది. ‘చిన్నప్పటి నుంచి రకరకాల పోటీ పరీక్షలు ఎక్కడ జరిగినా రాసేదాన్ని. ఇంటర్ అయ్యాక ఎంట్రన్స్‌లు రాస్తే ర్యాంక్ వచ్చింది. కాని ఏ బ్రాంచ్ ఎన్నుకోవాలో తెలియలేదు. వరంగల్ ఎన్.ఐ.ఐ.టి.లో సివిల్‌కు అప్లై చేస్తే సీట్ వచ్చింది. సివిల్ ఎందుకు అప్లై చేశానో నాకే తెలియదు. అయితే దాంతో పాటు ఎన్.ఎస్.ఐ.టి. (నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, ద్వారకా)లో కంప్యూటర్ సైన్స్ అప్లై చేస్తే ఆ సీటు కూడా వచ్చింది. దీనికంటే అదే మెరుగనిపించి కంప్యూటర్ సైన్స్ చదివాను’ అని తెలిపింది శ్రద్ధ. ఉద్యోగం, టీచింగ్ చదువు చివరలో ఉండగానే హైదరాబాద్ మైక్రోసాఫ్ట్‌లో ఇన్టెర్న్ వచ్చింది శ్రద్ధకు. అది పూర్తయ్యాక ఉద్యోగమూ వచ్చింది. అయితే శ్రద్ధ ఇన్టెర్న్ చేస్తున్నప్పటి నుంచే గచ్చిబౌలిలో కంప్యూటర్ కోర్సులను బోధించసాగింది. ఉద్యోగం వచ్చాక కూడా కంప్యూటర్ కోర్సులకు ఫ్యాకల్టీగా పని చేసింది. ‘ఉద్యోగంలో కంటే ఎవరి జీవితాన్నయినా తీర్చిదిద్దే బోధనే నాకు సరైందనిపించింది. అదే సమయంలో యూట్యూబ్ ద్వారా ఎక్కడెక్కడో ఉన్న విద్యార్థులకు పాఠాలు చెప్పడం, కోర్సులు తెలియచేయడం, వారి స్కిల్స్ పెరిగేలా గైడ్ చేయడం అవసరం అనుకున్నాను. మైక్రోసాఫ్ట్‌లో నాది మంచి ఉద్యోగం. కాని ఏదైనా కొత్తగా చేయాలనుకోవడం కూడా మంచిదే అని జాబ్‌కు రిజైన్ చేశాను’ అంది శ్రద్ధ. అప్నా కాలేజ్ శ్రద్ధ ‘అప్నా కాలేజ్’ పేరుతో యూట్యూబ్ చానల్ తెరిచింది. ఇంటర్ స్థాయి నుంచి విద్యార్థులకు ఏయే కోర్సులు చదివితే ఏం ఉపయోగమో, ఏ ఉద్యోగాలకు ఇప్పుడు మార్కెట్ ఉందో, ఆ ఉద్యోగాలు రావాలంటే ఏ కోర్సులు చదవాలో తెలిపే వీడియోలు చేసి విడుదల చేయసాగింది. 2020లో ఈ చానల్ మొదలుపెడితే ఇప్పుడు 40 లక్షల మంది సబ్స్క్రయిబర్లు తయారయ్యారు. కోట్లాది వ్యూస్ ఉంటాయి. అందుకు తగ్గట్టుగా లక్షల్లో శ్రద్ధ ఆదాయం ఉంది. ‘ముప్పై ఏళ్ల క్రితం డిగ్రీల ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేవారు. ఎందుకంటే డిగ్రీలు తక్కువ ఉండేవి. ఇవాళ డిగ్రీలు అందరి దగ్గరా ఉన్నాయి. కావాల్సింది స్కిల్స్. ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో ఆ ఉద్యోగానికి సంబంధించిన స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు ముందుకు దూసుకెళ్లవచ్చు. నా వీడియోలు ఆ మార్గంలో ఉంటాయి’ అని తెలిపింది శ్రద్ధ అలియాస్ సలహాల అక్క. -
పనేమీ లేకుండా రూ.కోటిన్నర జీతమిచ్చారు!
టెక్ కంపెనీల్లో ఉద్యోగులకు రూ.లక్షల్లో జీతాలు ఉంటాయి. పని ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయితే తాను ఏ పని చేయకుండా రూ.1.5 కోట్ల జీతం తీసుకున్నానని ఫేస్బుక్ యాజమాన్య సంస్థ మెటాకు చెందిన ఓ మాజీ ఉద్యోగిని చెప్పడం తాజాగా అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. దీనికి సంబంధించి ‘ఇండిపెండెంట్’ అనే ఆన్లైన్ వార్తా సంస్థ ఒక కథనాన్ని వెలువరించింది. ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్ సృష్టికర్త.. మింత్రాకు సీఈవో.. ఈ సూపర్ ఉమన్! మెటా కంపెనీలో రిక్రూటర్‌గా పనిచేసిన మాడెలిన్ మచాడో అనే మహిళ.. తాను ఏ పనీ చేయకుండా సంవత్సరానికి 1,90,000 డాలర్లు (దాదాపు రూ. 1.5 కోట్లు) జీతం అందుకున్నట్లు చెప్పారు. 2021లో మెటా కంపెనీలో తన ఆరు నెలల ఉద్యోగ అనుభవాన్ని ఆమె టిక్‌టాక్ వీడియోలో వెల్లడించారు. రిక్రూటర్‌గా పని చేసిన తాను ఒక్కరినీ కూడా రిక్రూట్ చేయలేదని పేర్కొన్నారు. దీనికి కారణం ఆ సమయంలో కంపెనీకి రిక్రూట్మెంట్ ఆలోచనే లేకపోవడం అని చెప్పారు. మెటా కంపెనీలో రోజంతా నేర్చుకోవడంలోనే గడిచిపోయేదని, ఆ కంపెనీలో ఉద్యోగంలో కొత్తగా చేరిన వారికి ఇచ్చే శిక్షణ ఉన్నతంగా ఉంటుందని కూడా ఆమె పేర్కొన్నారు. రిక్రూట్మెంట్లు లేకపోయినప్పటికీ టీమ్ మీటింగ్‌లు మాత్రం ఎక్కువగా ఉండేవని చెప్పారు. తన టీమ్‌లోని వారందరూ కొత్తవారే కావడంతో ఎవరూ ఎవరినీ రిక్రూట్ చేసుకోలేదని వివరించారు. ఇదీ చదవండి: లక్ష టవర్లు.. 5జీ నెట్‌వర్క్‌లో రిలయన్స్ జియో దూకుడు! ఏ పనీ చేయకుండానే జీతమిచ్చారని మచాడో చేసిన వీడియోపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో కొన్ని రోజుల తర్వాత దీనిపై వివరణ ఇస్తూ లింక్డ్ఇన్లో ఆమె పోస్ట్ చేశారు. తాను టిక్‌టాక్‌లో పెట్టిన వీడియో తప్పు కోణంలో వైరల్ అయిందని, తన ఉద్దేశం వేరు అని వివరించారు. కాగా తీవ్ర ఆర్థిక సంక్షోభానికి రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో మెటా ఇటీవల మరో విడత లేఆఫ్‌లను ప్రకటించింది. 10,000 ఉద్యోగాలను తొలగించనున్నట్లు పేర్కొంది. 5,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా వాటినీ ఆపేసింది. తక్కువ ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్ట్‌లను వాయిదా వేసింది. -
మాజీ ఎగ్జిక్యూటివ్ ఫిర్యాదు: కోర్టులో ఇన్ఫోసిస్‌కు షాక్
సాక్షి, ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు భారీ షాక్ తగిలింది.ఇన్ఫోసిస్ మాజీ సీనియర్ ఉద్యోగి, జిల్ ప్రీజీన్ ఆరోపణలను కొట్టి వేయాలని ఇన్ఫోసిస్ దాఖలు చేసిన పిటిషన్‌ను అమెరికా కోర్టు తాజాగా తిరస్కరించింది. అమెరికా నియామకాల్లో వయస్సు, లింగ, జాతి వివక్ష చూపారని ఆమె ఇన్ఫోసిస్‌పై దావా వేశారు. (Hong Kong టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన టికెట్లు ఫ్రీ) కంపెనీలోని సీనియర్ సిబ్బంది వయస్సు, లింగం, జాతి ఆధారంగా నియామకాల్లో వివక్షతో, పక్షపాతంగా వ్యహరించారంటూ గత ఏడాది అమెరికా కోర్టులో జిల్ ప్రీజీన్ ఫిర్యాదు చేశారు. ఈ పద్ధతి జాతి వివక్ష, చట్టవిరుద్ధమని వాదించినందుకు ఒత్తిడికి, వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఇన్ఫోసిస్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కన్సల్టింగ్ హెడ్ మార్క్ లివింగ్స్టన్, అప్పటి ప్రీజీన్ పార్టనర్స్ డాన్ ఆల్బ్రైట్, జెర్రీ కర్ట్జ్లపై కేసు నమోదైంది. అయితే దీనిపై ఇన్ఫోసిస్ స్పందనను కోర్టు తాజాగా తోసిపుచ్చింది. ప్రీజీన్ చేసిన క్లెయిమ్‌లను విచారణకు స్వీకరిస్తూ, న్యూయార్క్‌లోని సదరన్ డిస్ట్రిక్ట్‌లోని యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి ఇన్ఫీ వాదనను తిరస్కరించారు. అంతేకాదు ఈ ఆరోపణలపై వచ్చే 21 రోజుల్లోగా తమ స్పందనను తెలియ జేయాలని కూడా ఆదేశించింది. దీనిపై ఇన్ఫోసిస్ ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా ఇన్ఫీలో టాలెంట్ అక్విజిషన్ వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్‌లను రిక్రూటింగ్ నిపుణురాలు జిల్ ప్రీజీన్ ఈ కేసు వేశారు. భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులు, ఇంట్లో పిల్లలున్న మహిళలతోపాటు 50 ఏళ్లు పైబడిన అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆంక్షలు విధించారని జిల్ ఆరోపించారు. నియామకాల్లో వివక్ష చూపేలా తనపై ఒత్తడి చేశారని ఆమె ఆరోపించారు. వీటిని వ్యతిరేకించినందుకు తనను ఉద్యోగం నుంచి తొలగించి ప్రతీకారం తీర్చు కున్నారనేది జిల్ ఆరోపణ. ఇది న్యూయార్క్ నగర మానవ హక్కుల చట్టాల ఉల్లంఘన అంటూ జిల్ ప్రిజీన్ సెప్టెంబర్ 2021లో తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నైట్స్ ఖండన మరోవైపు ఆధునిక యుగంలో జాతి, లింగం, వయసు ఆధారిత వివక్ష ఇది తీరని విషాదమంటూ నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (నైట్స్)ఇన్ఫోసిస్ తీరును తప్పుబట్టింది. పని చేయాలనే కోరిక జీవితాన్ని విలువైనదిగా మారుస్తుందని అలాంటి ప్రయత్నాలను అడ్డు కోవడం నేరమని వ్యాఖ్యానించింది. #Discrimination due to age is one of the great tragedies of modern life. The desire to work and be useful is what makes life worth living, and to be told your efforts are not needed because you are the wrong age is a crime.#ITEmployees #StrongerTogether #JusticeforEmployees pic.twitter.com/X7dDBTOQ5R — Nascent Information Technology Employees Senate (@NITESenate) October 8, 2022 -
సీసీజీ లేఖ రాజకీయ ప్రేరేపితం
న్యూఢిల్లీ: దేశంలో విద్వేష రాజకీయాలు కొనసాగుతున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోదీకి ఇటీవల రాసిన బహిరంగ లేఖలో మాజీ సివిల్ సర్వీస్ అధికారులు చేసిన ఆరోపణలను మాజీ న్యాయమూర్తులు, ప్రభుత్వ మాజీ అధికారులు తీవ్రంగా ఖండించారు. వారి లేఖ రాజకీయ ప్రేరేపితమని, మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి చేసిన ప్రయత్నమని మండిపడ్డారు. కానిస్టిట్యూషన్ కాండక్ట్ గ్రూప్(సీసీజీ) పేరిట 108 మంది మాజీ సివిల్ సర్వీసు అధికారులు రాసిన లేఖలో నిజాయతీ లేదని తేల్చిచెప్పారు. మోదీకి అండగా నిలుస్తున్న ప్రజల పట్ల వారి ఆక్రోశం ఇందులో వ్యక్తమవుతోందన్నారు. ఈ మేరకు ‘కన్సర్న్డ్ సిటిజెన్స్’ పేరిట 8 మంది మాజీ న్యాయమూర్తులు, 97 మంది మాజీ ఉన్నతాధికారులు, 92 మంది మాజీ సైనికాధికారులు ప్రధాని మోదీకి తాజాగా బహిరంగ లేఖ రాశారు. ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సీసీజీ లేఖలోని ఆరోపణలను ఇందులో తిప్పికొట్టారు. సిక్కిం హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ప్రమోద్ కోహ్లీ, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు కన్వల్ సిబల్, శశాంక్, ‘రా’ మాజీ చీఫ్ సంజీవ్ త్రిపాఠి తదితరులు ఇందులో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో విద్వేష బీజాలు నాటే కుతంత్రలు సాగవని తేల్చిచెప్పారు. -
వారు జస్టిస్ బాబ్డేను కలవలేదు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ బాబ్డేను జస్టిస్ నారిమన్, జస్టిస్ చంద్రచూడ్‌లు కలిశారంటూ వచ్చిన పత్రికా కథనాన్ని సుప్రీంకోర్టు ఖండించింది. ఆ కథనం పూర్తిగా అబద్ధమని పేర్కొంది. సీజేఐపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణపై జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని అంతర్గత కమిటీ ఏకపక్షంగా దర్యాప్తు సాగించడం సరికాదని, విచారణలో సహకరించేందుకు అమికస్ క్యూరీగా లాయర్‌ను నియమించుకోవాలని జస్టిస్ నారిమన్, జస్టిస్ చంద్రచూడ్‌లు సూచించినట్లు ఓ పత్రిక పేర్కొంది. ఈ కథనం అబద్ధమంటూ ఆదివారం సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘జస్టిస్ ఎస్ఏ బాబ్డేను జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు మే 3వ తేదీ సాయంత్రం కలిసినట్లు ఆ ప్రముఖ వార్తా పత్రికలో కథనం రావడం దురదృష్టకరం. అది పూర్తిగా అబద్ధం. అంతర్గత విచారణ కమిటీ నిర్దేశించిన పనిని మరే ఇతర జడ్జీల సాయం అవసరం లేకుండానే చేసుకుపోతుంది. ఈ విషయంలో ఆ కమిటీకి సుప్రీంకోర్టు జడ్జి ఎవరైనా ఎలాంటి సలహా ఇచ్చినా అది దాని విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకున్నట్లే అవుతుంది’అని ఆయన స్పష్టం చేశారు. సీజేఐపై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదుపై విచారణ జరుపుతున్న జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీలో జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ ఉన్నారు. ఈ కమిటీ విచారణకు మూడు పర్యాయాలు హాజరైన ఫిర్యాదుదారు, మాజీ ఉద్యోగిని వివిధ కారణాలు చూపుతూ విచారణ ప్రక్రియకు ఇకపై హాజరు కాబోనని ఇటీవల వెల్లడించారు. -
ప్రమాదంలో ‘న్యాయ’ స్వతంత్రత
న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. సీజేఐ కార్యాలయాన్ని అస్థిరపరిచేందుకు ఓ బలీయమైన శక్తి కుట్ర పన్నుతోందని ఆరోపించారు. జస్టిస్ గొగోయ్ తనను లైంగికంగా వేధించారంటూ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్(జేసీఏ)గా పనిచేసిన ఓ మహిళ(35) 22 మంది సుప్రీంకోర్టు జడ్జీలకు లేఖ రాయడంపై ఆయన ఈ మేరకు స్పందించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో తన సారథ్యంలో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటుచేసిన గొగోయ్.. అత్యవసరంగా విచారణను చేపట్టారు. మరోవైపు జస్టిస్ గొగోయ్‌కు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్, జాతీయ హరిత ట్రైబ్యునల్ బార్ కౌన్సిల్ సహా పలు న్యాయవాదుల సంఘాలు మద్దతు ప్రకటించాయి. నాకంటే నా ప్యూన్ ఆస్తులే ఎక్కువ.. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గొగోయ్ మాట్లాడుతూ.. ‘జడ్జీలకు గౌరవం ఒక్కటే ఉంటుంది. నిరాధార ఆరోపణలతో ఏకంగా దానిపైనే దాడి జరిగితే బుద్ధి ఉన్నవారెవరూ జడ్జీ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకురారు. ఇలాంటి ఘటనలు జరిగితే ఏ జడ్జీ తీర్పులను వెలువరించరు. కోర్టులోకి సావధానంగా వచ్చి విచారణను వాయిదా వేస్తారు. నేను 20 ఏళ్లకు పైగా న్యాయమూర్తిగా పనిచేస్తున్నా. నా బ్యాంకులో రూ.6.80 లక్షలు మాత్రమే ఉన్నాయి. మరో రూ.40 లక్షల ప్రావిడెంట్ ఫండ్ ఉంది. మరో బ్యాంకు ఖాతాలో రూ.21.80 లక్షలు ఉండగా, వాటిలో రూ.15 లక్షలను గువాహటిలో ఇంటి మరమ్మతు కోసం నా కుమార్తె అందజేసింది. నా మొత్తం ఆస్తులు ఇవే. నేను న్యాయమూర్తి కావాలనుకున్నప్పుడు నా దగ్గర ఇంతకంటే ఎక్కువ ఆస్తులు ఉండేవి. ఇప్పుడు నా కంటే నా ఫ్యూన్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి. డబ్బు విషయంలో నన్నెవరూ ఇబ్బంది పెట్టలేరు. అందుకే ఇలా తప్పుడు ఆరోపణలతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నాపై వచ్చిన అభియోగాలపై మరీ అంతగా దిగజారిపోయి ఖండించలేను’ అని స్పష్టం చేశారు. మీడియా విజ్ఞతకే వదిలేస్తున్నాం.. గతంలో ఓ సుప్రీం జడ్జితో పాటు సీనియర్ న్యాయవాదిపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఇందుకు సంబంధించి ఎలాంటి వార్తలను ప్రచురించరాదని మీడియాను సుప్రీం ఆదేశించిన విషయాన్ని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ గుర్తుచేశారు. తాజాగా లైంగికవేధింపులకు సంబంధించిన ఆరోపణలను పలు వెబ్సైట్లు ప్రచురించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వేణుగోపాల్ వాదనలపై జస్టిస్ గొగోయ్ స్పందిస్తూ..‘పరిస్థితులు చాలాదూరం పోవడంతోనే ఈ అసాధారణ విచారణను చేపట్టాల్సి వచ్చింది. ఈ విషయంలో బాధ్యతాయుతంగా, నియంత్రణతో వ్యవహరించే అంశాన్ని మీడియా విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. ఈ కేసులో ఉత్తర్వులు ఇచ్చే అధికారాన్ని సీనియర్ జడ్జి జస్టిస్ మిశ్రాకు వదిలిపెడుతున్నా. ఇందులో నేను భాగం కాబోను’ అని తెలిపారు. సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రతీ ఉద్యోగి పట్ల న్యాయంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. ఇలాంటి విషయాల్లో న్యాయవ్యవస్థ బలిపశువు కారాదని జస్టిస్ మిశ్రా వ్యాఖ్యానించారు. ఉద్యోగం నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టినప్పుడు మౌనంగా ఉన్న సుప్రీంకోర్టు ఉద్యోగిని, అకస్మాత్తుగా సీజేఐపై ఆరోపణలు చేస్తున్నారని జస్టిస్ ఖన్నా చెప్పారు. ఈ కేసును 30 నిమిషాలపాటు విచారించాక ఈ వ్యవహారంలో ఎప్పుడు అవసరమైతే అప్పుడు న్యాయపరమైన ఉత్తర్వులు జారీచేస్తామని కోర్టు తెలిపింది. ఇలాంటి ఆరోపణల వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వసనీయత సడలిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. సుప్రీం ప్రధాన కార్యదర్శిæ సుధాకర్ మాట్లాడుతూ.. మాజీ జేసీఏ లేఖ కొన్ని మీడియా పోర్టల్స్‌లో ఉదయం 8–9 గంటల మధ్యలో రాగా, తమకు 9.30 గంటల ప్రాంతంలో తెలిసిందని వ్యాఖ్యానించారు. సీజేఐ మాస్టర్ ఆఫ్ రోస్టర్ అనీ, ఆయన ఏ బెంచ్‌ను ఏర్పాటుచేస్తే వారే కేసును విచారిస్తారని స్పష్టం చేశారు. కాగా, ప్రత్యేకబెంచ్లో సీజేఐ జస్టిస్ గొగోయ్ సభ్యుడిగా ఉండొచ్చా? అన్న విషయమై లాయర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం కానీ, రాజకీయ పార్టీలు కానీ ఇంతవరకూ స్పందించలేదు. కాగా, నవీన్ అనే వ్యక్తికి సుప్రీంకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.50,000 వసూలుచేసిన కేసులో ఈ మాజీ జేసీఏకు మంజూరుచేసిన బెయిల్‌ను రద్దుచేయాలని ఢిల్లీ పోలీసులు ట్రయల్‌కోర్టును శనివారం ఆశ్రయించారు. ఆమెపై 3 ఎఫ్ఐఆర్లున్నాయ్.. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మాజీ జేసీఏకు నేరచరిత్ర ఉందని జస్టిస్ గొగోయ్ తెలిపారు. ‘కోర్టులో చేరేనాటికే ఆమెపై ఓ ఎఫ్ఐఆర్ పెండింగ్‌లో ఉంది. బెయిల్‌పై విడుదలయ్యాక ఓ సాక్షిని బెదిరించడంతో ఆమెపై నమోదైన ఎఫ్ఐఆర్ల సంఖ్య మూడుకు చేరింది. ఎఫ్ఐఆర్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు అసలు సుప్రీంకోర్టు సిబ్బందిగా ఆమెను ఎలా ఎంపికచేశారు? నేరచరిత్ర కారణంగా ఆమె నాలుగురోజుల పాటు జైలులో గడిపారు. ప్రస్తుతం స్వతంత్ర న్యాయవ్యవస్థ అదిపెద్ద ప్రమాదంలో ఉంది. దీన్ని నేను అనుమతించను. నా పదవీకాలం ఉన్న మరో 7 నెలల పాటు ఈ కుర్చీలో పక్షపాతంలేకుండా ధైర్యంగా తీర్పులను వెలువరిస్తా’ అని వెల్లడించారు. లేఖలో ఏముంది? ‘‘నేను సుప్రీంకోర్టులో జేసీఏగా లైబ్రరీలో టైపింగ్, డాక్యుమెంటేషన్ పనులను చేసేదాన్ని. జస్టిస్ గొగోయ్ వద్ద పనిచేసే జేసీఏ.. సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో నన్ను 2016, అక్టోబర్‌లో నియమించారు. 2018 ఆగస్టులో తన రెసిడెన్స్ ఆఫీస్‌లో నన్ను ఆయన చేరమన్నారు. ఓరోజు ఆఫీస్‌లో ఉన్నపుడు ‘నా భార్య, నా కూతురు తర్వాత నువ్వు నా మూడో ఆస్తివి’ అని అన్నారు. తాను సీజేఐ అయ్యాక తప్పకుండా సాయం చేస్తామని పదేపదే చెప్పేవారు. అయితే మా బావ దివ్యాంగుడనీ, ఆయనకు ఉద్యోగమేదీ లేదని చెప్పా. సీజేఐగా బాధ్యతలు చేపట్టగానే మా బావను జూనియర్ కోర్ట్ అటెండెంట్‌గా నియమించారు. తర్వాత నన్ను ఆఫీస్‌కు పిలిచి నా తలను, వీపును, వెనుకభాగాన్ని తడిమారు. 2018, అక్టోబర్ 11న ఆఫీసులో గొగోయ్ నా పక్కకు వచ్చి నిలబడి నా నడుముపై చేయి వేసి దగ్గరకు లాక్కున్నారు. వెంటనే నేను ఆయన్ను వెనక్కి తోసి భయంతో డెస్క్‌లో కూర్చుండిపోయాను. ఇది జరిగిన కొద్దిరోజులకే తాను క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు మెమో ఇచ్చారు. అక్టోబర్, నవంబర్ మధ్యలో నన్ను మూడుసార్లు బదిలీ చేశారు. అధికారుల నిర్ణయాన్ని ప్రశ్నించాననీ, అధికారులను ప్రభావితం చేసేందుకు యత్నించాననీ, చెప్పకుండా విధులకు గైర్హాజరయ్యానని నాపై 3 అభియోగాలు నమోదుచేశారు. డిసెంబర్ 21న నన్ను విధుల నుంచి తొలగించారు’’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు. -
సీజేఐ రంజన్ గొగోయ్‌పై లైంగిక ఆరోపణల సంచలనం
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై లైంగిక ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జస్టిస్ రంజన్ గోగొయ్ గతంలో తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ 35 ఏళ్ల మహిళ శుక్రవారం ఫిర్యాదు చేశారు. సుప్రీం కోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్‌గా పని చేసిన ఆమె 22మంది న్యాయమూర్తులకు సమర్పించిన అఫిడవిట్లో ఈ ఆరోపణలు చేశారు. 2018 అక్టోబర్ 10, 11 తేదీల్లో జస్టిస్ గొగోయ్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించి, వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఆయన వేధింపులకు తిరస్కరించినందుకు తనను, తన కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేశారని, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతో సుప్రీం జడ్జిలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నేడు (శనివారం, ఏప్రిల్20న) సిజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సీజేఐ రంజన్ గొగోయ్ స్పందన ఈ ఆరోపణలను ఖండించిన ప్రధాన నాయ్యమమూర్తి ఇరవై ఏళ్లపాటు నిస్వార్థంగా సేవలందించిన తనపై ఇలాంటి ఆరోపణలు రావడం నమ్మలేకపోతున్నానన్నారు. తనను తొలగించాలనే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతోందన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ప్రమాదం పొంచి వుందంటూ గొగోయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అఫిడవిట్లో ఆమె చేసిన ఆరోపణలు ఆగష్టు 2018 లో ఆయన ఆఫీసులో నియామకం అనంతరం లైంగిక వేధింపులు చోటు చేసుకున్నాయి. ఈ వేధింపులను ప్రతిఘటించిన నేపథ్యంలో అనుమతి లేకుండా ఒక రోజు సాధారణ సెలవు తీసుకున్న కారణంగా డిసెంబర్ 21 న సర్వీసులనుంచి తొలగించారు. అంతేకాదు ఈ సెగ నా కుటుంబాన్ని కూడా చుట్టుముట్టింది. ఢిల్లీలో హెడ్ కానిస్టేబుల్స్‌గా పనిచేస్తున్న నా భర్త, సోదరుడు డిసెంబరు 28, 2018 (పరస్పరం అంగీకారంతో రద్దు చేసుకున్న 2012 నాటి కేసు ఆధారంగా) సస్పెన్షన్‌కు గురయ్యారు. జనవరి 11 న, ప్రధాన న్యాయమూర్తి, ఒక మహిళా పోలీసు అధికారి సమక్షంలో జస్టిస్ గొగోయ్ భార్యకు క్షమాపణలు చెప్పించారు. అలా ఎందుకు చేశారో అర్థంకానప్పటికీ, పై అధికారి సూచలను అనుసరించాను. ఆమె చెప్పినట్లే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాను. అయినా వేధింపుల పర్వం ఆగలేదు. టెంపరరీ జూనియర్ కోర్టు అటెండెంట్‌గా ఉన్న దివ్యాంగుడైన నాబంధువును సర్వీసు నుంచి తొలగిస్తూ జనవరి 14న ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తరువాత రాజస్థాన్‌లోని గ్రామానికి వెళ్లిన నన్ను, నా భర్తను, చీటింగ్ కేసులో విచారించాలంటూ మార్చి 9 న ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ( 2017లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 50 వేలు తీసుకుని మోసం చేసిందనేది ఆరోపణ). ఆ మరుసటి రోజు తనతోపాటు, భర్త, బావ, ఆయన భార్య, ఇతర బంధువును తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా 24 గంటల పాటు కాళ్లు చేతులకు సంకెళ్లు వేసి, తిండి, నీళ్లు ఇవ్వకుండా శారీరకంగా హింసించడంతో పాటు దుర్భాషలాడారు. ఈ ఆరోపణలకు తోడు వీటికి సంబంధించి కొంత వీడియో ఫుటేజ్‌ను, ఫోటోలను ఆమె అఫిడవిట్లో పొందుపర్చారు. అటు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ఈ ఆరోపణలను తిరస్కరించారు. ఇవి పూర్తిగా తప్పుడు, దురదృష్టకరమైన ఆరోపణలని పేర్కొన్నారు. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. ఆమెకు నేర చరిత ఉందని ఆమెపై ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్నారు. -
తుపాకీతో కాల్చుకుని సీఆర్పీఎఫ్ మాజీ ఉద్యోగి ఆత్మహత్య
హైదరాబాద్: అనారోగ్యం, మానసిక ఒత్తిడి భరించలేక సీఆర్పీఎఫ్ మాజీ ఉద్యోగి తన లైసెన్స్డ్ గన్‌తో కాల్చు కుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో గురువారం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా పరిగికి చెందిన మాదగోని రాములు(60), చంద్రకళ దంపతులు. వీరు 15 ఏళ్ల క్రితం జవహర్‌నగర్‌లోని ప్రగతినగర్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. రాములు సీఆర్పీఎఫ్లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించి 6 ఏళ్ల క్రితం పదవీ విరమణ పొందాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు ఆర్మీలో జవానుగా విధులు నిర్వహిస్తుండగా చిన్న కుమారుడు, కుమార్తె ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చంద్రకళ సహాయకురాలిగా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం చంద్రకళ తన మనవడికి జ్వరం రావడంతో చూసి వద్దామని అదే కాలనీ సమీపంలో ఉన్న పెద్ద కుమారుడి ఇంటికి వెళ్లింది. కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉండటంతో రాములు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరులేని సమయంలో తన లైసెన్స్ తుపాకీతో తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి పక్కన ఉన్న వారికి శబ్ధం రావడంతో వచ్చి చూసేసరికి రాములు రక్తపుమడుగులో పడి ఉన్నాడు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో పరిసర ప్రాంతాలను గాలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రతీకారంతో ‘ఫేస్‌బుక్క’య్యారు!
మాజీ ఉద్యోగినికి ఫేస్బుక్ ద్వారా వేధింపులు బీపీఓ కంపెనీ నిర్వాహకుడికి అరదండాలు ఫొటోలకు ఫోజులిచ్చిన 14 మందీ నిందితులే నలుగురిని మంగళవారం అరెస్టు చేసిన వైనం సాక్షి, సిటీబ్యూరో: తన దగ్గర ఉద్యోగం చేసి మానేసిన యువతి తనపైనే ఆన్లైన్లో సెటైర్స్ వేస్తోందని పగబట్టిన ఓ వ్యక్తి.. ప్రతీకారంగా ఫేస్బుక్ ద్వారానే ఆమెపై విరుచుకుపడ్డాడు... ఆ యువతికి సంబంధించి అసభ్యకరమైన వ్యాఖ్యల్ని ఫొటోలు తీసి పోస్ట్ చేశాడు... సీన్ కట్ చేస్తే సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కి జైలుకెళ్లాడు. ఇతడి ఆదేశాల మేరకు ‘ఫొటో’లకు ఫోజులిచ్చిన 14 మంది ఉద్యోగులూ నిందితుల జాబితాలోకి చేరారు. వీరిలో నలుగురు మంగళవారం అరెస్టు కాగా... మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సికింద్రాబాద్ ప్రాంతంలో సయ్యద్ అబ్దుల్ ఖదీర్ బీపీఓ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఇందులో రెండు నెలల పాటు పని చేసిన యువతిని కొన్నాళ్ల క్రితం అనివార్య కారణాలతో ఉద్యోగం నుంచి తొలగించాడు. అయితే, ఆ యువతికి చెల్లించాల్సిన జీతభత్యాలను చెల్లించకపోవడంతో అసలు కథ మొదలైంది. సరదాల పోస్టింగ్స్‌పై సెటైర్... బీపీఓ సంస్థ ఎండీ ఖదీర్‌తో పాటు బాధితురాలైన యువతికీ ఫేస్బుక్ పేజ్లున్నాయి. వాటి లో వీరిద్దరితో పాటు సంస్థలో పని చేసే ఇతర ఉద్యోగులూ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. ఖరీద్ కార్లతో తిరుగుతూ స్నేహితులతో సరదాగా గడిపిన ఫొటోలను తన ఫేస్బుక్ పేజ్‌లో పోస్ట్ చేశాడు. వీటిని చూసిన మాజీ ఉద్యోగిని తీవ్రంగా స్పం దించింది. తనకు ఇవ్వాల్సిన జీతం డబ్బుతో జల్సాలు చేస్తున్నాడని కామెంట్ పెట్టింది. పలు సందర్భాల్లో ఇలానే ఆ యువతి కామెంట్స్ పోస్టు చేయడంతో ఖదీర్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఆమెపై ఆన్లైన్లోనే ప్రతీకారం తీర్చుకోవాలని ఫేస్బుక్ ద్వారానే కౌంటర్ ఎటాక్ కు దిగాడు. ఇందులో తన కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల్నీ పాత్రధారుల్ని చేశాడు. ఫొటోలకు ‘ఫోజులిచ్చి’ నిందితులుగా... సదరు యువతి పేరు వినియోగించిన పరుష పదజాలం, అసభ్యకర వ్యాఖ్యలతో ప్రింట్ఔట్లు తీయించాడు. వీటిని తన ఉద్యోగుల ద్వారా డిస్ప్లే చేయిస్తూ ఫొటోలు తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన బాధితురాలు ఆగస్టు 8న సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ పి.రాజు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలను సేకరించి ప్రధాన నిందితుడిగా ఉన్న బీపీఓ కంపెనీ ఎండీతో ఖదీర్‌తో పాటు అతడికి సహకరించిన అమిత్ లాల్వానీని గతనెల్లో అరెస్టు చేశారు. అసభ్యకర వ్యాఖ్యలతో కూడిన ప్రింట్ ఔట్లతో ఫొటోలకు ఫోజులిచ్చిన సంస్థ ఉద్యోగులు 14 మందినీ పోలీసులు ఈ కేసులో నిందితులుగా చేర్చారు. వీరిలో ఎకేంద్ర బిస్తా, కేవియన్ రోస్, మహ్మద్ అర్బాజ్, సాల్మన్ ఫెన్సికోలను మంగళవారం అరెస్టు చేశారు. మిగిలిన వారి పైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.