బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాలు, పాకిస్తాన్ మోడల్ సోమి అలీ ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఆమె బాలీవుడ్ పరిశ్రమ, సల్మాన్‌పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 1991లో సల్మాన్‌ను పెళ్లి చేసుకోవాలనే ఆశతో పరిశ్రమలో అడుగు పెట్టిన సోమి 1998 వరకు సినిమాల్లో నటించారు. తర్వాత కొంతకాలానికే తెరపై కనుమరుగయ్యారు. ఇండస్ట్రీలో ఉన్నది కొంతకాలమే అయిన బాలీవుడ్ తనకు ఎన్నో చేదు జ్ఞాపకాలను ఇచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
‘కేరీర్ ప్రారంభంలో నా సినిమాలు బాగానే ఆడాయి. తర్వాత కొన్ని ప్లాప్‌లు చుశాను. ఆ సమయంలో నాకు అవకాశాలు తగ్గాయి. అవకాశాల ఇస్తామని చెప్పి కొంతమంది డైరెక్టర్‌లు నాతో శృంగారం చేయాలని ప్రయత్నించారు. అదే సమయంలో నేను ఓ భయంకరమైన రిలేషన్ షిప్‌లో ఉన్నాను. అది వాటన్నింటికంటే దుర్భరమైనదిగా ఇప్పుడు అనిపిసోంది’ అంటూ సోమి, సల్మాన్‌తో ప్రేమ విషయాన్ని ఉద్దేశిస్తూ చెప్పుకొచ్చారు. కాగా సల్మాన్‌ఖాన్ బాలీవుడ్‌లో పలువురు అగ్ర హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. వారిలో సల్మాన్ మొదటి గర్ల్‌ఫ్రెండ్‌గా అందరికి గుర్తొచ్చేది మాత్రం సోమీ అలీనే. ఆమె హీరోయిన్‌గా కంటే సల్మాన్ గర్ల్‌ఫ్రెండ్‌గానే ఎక్కువగా పాపులర్ అయ్యారు.
చదవండి:
పెళ్లి తర్వాత నటించనన్నావ్.. మరి ఇదేంటి?!
‘ఆరేళ్ల పాటు డేటింగ్ చేశాం..సల్మాన్ మోసం చేశాడు’
Comments
Please login to add a commentAdd a comment