Actress Somy Ali Reveals About Her Breakup With Salman Khan - Sakshi
Sakshi News home page

'సల్మాన్‌ఖాన్‌ నన్ను మోసం చేశాడు.. అందుకే విడిపోయా'

Published Thu, Apr 1 2021 4:56 PM | Last Updated on Thu, Apr 1 2021 7:13 PM

Somy Ali Says Salman Khan Cheated on Her Talks About Their Break up - Sakshi

కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ పలువురు అగ్ర హీరోయిన్లతో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. వారిలో సల్మాన్‌ మొదటి గర్ల్‌ఫ్రెండ్‌గా అందరికి గుర్తొచ్చేది మాత్రం పాకిస్తాన్‌ నటి సోమీ అలీ. ఆమె హీరోయిన్‌గా కంటే సల్మాన్‌ గర్ల్‌ఫ్రెండ్‌గానే ఎక్కువగా పాపులర్‌  అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె సల్మాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. 20 ఏళ్ల క్రితం తామిద్దరం ప్రేమలో ఉన్నమాట వాస్తవమేనని, ఇద్దరం పెళ్లి కూడా చేసుకుందాం అని అనుకున్నామని, అయితే సల్మాన్‌ తనను మోసం చేశారని, అందుకే సల్మాన్‌ నుంచి విడిపోయానని ఆరోపించింది. అప్పటినుంచి ఎవరి లైఫ్‌లో వాళ్లు మూవ్‌ ఆన్‌ అయ్యామని తెలిపింది.

'నిజానికి హీరోయిన్‌ అవ్వాలనే ఆశతో పరిశ్రమకు రాలేదని, కేవలం సల్మాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకోవాలనే ఆశయంతోనే ఇండియాకు వచ్చాను. 'మైనే ప్యార్ కియా' సినిమా చూసి సల్మాన్‌తో ప్రేమలో పడ్డాను. దాదాపు ఆరేళ్ల పాటు ఇద్దరం డేటింగ్‌ చేశాం. ఆ సమయంలో సల్మాన్‌ ఇంటికి చాలా సార్లు వెళ్లేదాన్ని. వాళ్ల పేరెంట్స్‌ చాలా మంచివారు. అందిరిని సమానంగా ఎలా చూడాలో వాళ్ల దగ్గరనుంచి నేర్చుకున్నా. వాళ్లు మతం గురించి పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. ప్రతీ వ్యక్తిని సమానంగా ట్రీట్‌ చేసేవారు. ఎవరు ఇంటికి వెళ్లినా ఎంతో ఆప్యాయంగా చేరదీసేవాళ్లు. ముఖ్యంగా సల్మా ఆంటీ(సల్మాన్‌ ఖాన్‌ మదర్‌)చాలా స్వీట్‌. వారి నుంచి చాలా నేర్చుకున్నా. కానీ సల్మాన్‌ నుంచి మాత్రం నేను ఒక్క విషయం కూడా నేర్చుకోలేదు' అని చెప్పుకొచ్చింది. 

ముంబైలో మోడలింగ్‌లో చేస్తుండగానే సోమీకి హీరోయిన్‌గా అవకాశం వచ్చింది.1992లో బులండ్‌ అనే చిత్రంతో హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత అక్షయ్‌కుమార్‌తో కలిసి నటించిన ఖిలాడీ మూవీ సూపర్‌ హిట్‌ కావడంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన అంత్‌(1994), కృష్ణ అవతార్‌(1993)తో పాటు ‘అవో ప్యార్‌ కరేనా’(1994) చిత్రాల్లో నటించిన సోమీ.. సల్మాన్‌తో డేటింగ్‌ చేశారు. దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట అప్పట్లో హోట్‌టాపిక్‌గా ఉండేది.

అయితే సల్మాన్‌తో బ్రేకప్‌ తర్వాత సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టిన ఆమె `నో మోర్‌ టియర్స్` అనే ఎన్జీఓని నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా మళ్లీ సినిమాల్లోకి వస్తారా అని ప్రశ్నించగా, తనకు మూవీస్‌పై ఆసక్తి లేదని, మళ్లీ ఇండస్ర్టీలోకి వచ్చే ఆలోచనే లేదని తెలిపింది. గతంలో కత్రినా కైఫ్,  సంగీత బిజ్లాని,  ఐశ్వర్య రాయ్ వంటి టాప్‌ హీరోయిన్లతో సల్మాన్‌ ప్రేమాయణం నడిపారు. ప్రస్తుతం మోడల్ యూలియా వంతూర్‌తో సల్మాన్‌ డేటింగ్‌ చేస్తున్నట్లు బీటౌన్‌ టాక్‌. 

చదవండి : ‘హీరోయిన్‌ అవ్వాలని రాలేదు.. సల్మాన్‌ కోసమే వచ్చాను’
సల్మాన్‌ మొదటి జీతం: మరీ అంత తక్కువా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement