
పట్నా: వివాహం జరిగిన 4 రోజులకే ఓ నవ వధువు దారుణ హత్యకు గురైంది. అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. ఆమె మాజీ ప్రేమికుడు నాటు తుపాకీతో కాల్పులు జరపడంతో ఆమె మృతిచెందింది. ఆ తర్వాత అతను కూడా కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బిహార్‌లోని నలంద జిల్లాలో భగాన్ బిఘా పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కెవైది ప్రాంతానికి చెందిన సందీప్ కుమార్ కూతురు షబ్నం కుమారికి షాపూర్‌కు చెందిన వికాస్ కుమార్‌తో మే 26వ తేదీన వివాహం జరిగింది.
షబ్నం భర్త తెలిపిన వివరాల ప్రకారం.. వివాహం జరిగిన 4వ రోజు షబ్నం ఆమె భర్తతో కలిసి వాహనంలో పుట్టింటికి బయలుదేరింది. మార్గమధ్యంలో బైక్‌పై వచ్చిన ఆమె రాజ్‌పాల్ పాశ్వాన్ అలియాస్ రేహాన్ వారి వాహనాన్ని అడ్డుకున్నాడు. రాజ్‌పాల్ తనతో రావాలని ఆమెను బలవంతం చేయగా, ఆమె అందుకు అంగీకరించలేదని తెలిపాడు. వెంటనే కోపంతో రాజ్‌పాల్ షబ్నం పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తుపాకి పెట్టి కాల్పులు జరిపాడు. అనంతరం తనని తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. ఇద్దరినీ జిల్లా సదర్ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు షబ్నం చనిపోయినట్లు ప్రకటించారు. అదే క్రమంలో రాజ్‌పాల్‌ను పరిస్థితి విషమంగా ఉండడంతో పాట్నాకు తరలించాలని సూచించారు. అయితే, అతను కూడా దారిలోనే మరణించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment