మాజీ గర్ల్‌ఫ్రెండ్ లేఖ రాస్తే.. దిద్ది మార్కులేశాడు! | student grades ex girl friend letter, posts in twitter | Sakshi
Sakshi News home page

మాజీ గర్ల్‌ఫ్రెండ్ లేఖ రాస్తే.. దిద్ది మార్కులేశాడు!

Published Tue, Feb 21 2017 4:08 PM | Last Updated on Fri, Jul 12 2019 3:07 PM

మాజీ గర్ల్‌ఫ్రెండ్ లేఖ రాస్తే.. దిద్ది మార్కులేశాడు! - Sakshi

మాజీ గర్ల్‌ఫ్రెండ్ లేఖ రాస్తే.. దిద్ది మార్కులేశాడు!

మాజీ గర్ల్‌ఫ్రెండ్ సారీ చెబుతూ అతడికి ఓ లేఖ రాసింది. మామూలుగా అయితే దాన్ని చూసి మళ్లీ ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి, లేదా తన మనసు విరిగిపోయిందంటూ జవాబు ఇవ్వాలి. ఇదేమీ చేయని ఆ కుర్రాడు.. ఆమె రాసిన లేఖలో తప్పులన్నింటినీ ఎంచి, వాటిని ఎర్ర ఇంకుతో పక్కన రాసి, ఆ లేఖను ఓ ఫొటో తీసి ట్విట్టర్‌లో పెట్టాడు. అమెరికాలోని స్టెట్సన్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థి ట్వీట్ చేసిన ఈ లేఖ.. బాగా వైరల్ అయ్యింది. తాను ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో వివరిస్తూ ఆమె ఓ సుదీర్ఘ లేఖ రాసింది. నోట్ పుస్తకంలోని కాగితం చించి మరీ ఆమె లేఖ రాసింది. అందులో ఆమె చాలా తప్పులు రాయడంతో ఆమె స్నేహితుడు నిక్.. వాటన్నింటినీ ఎర్ర ఇంకుతో మార్క్ చేశాడు. 
 
''మీ మాజీ గర్ల్ ఫ్రెండ్ క్షమాపణ లేఖ రాస్తే దానికి గ్రేడింగ్ ఇచ్చి, వెనక్కి తిప్పి పంపాలి'' అని అంటూ నిక్ ఆ లేఖను ఫొటో తీసి ట్వీట్ చేశాడు. పరిచయం చాలా సుదీర్ఘంగా ఉందని, అందులో చాలా వరకు వాక్యాలు రిపీట్ అయ్యాయని నిక్ రాశాడు. తాను అతడిని ఎప్పుడూ మోసం చేయలేదని రాయగా.. దాన్ని రుజువు చేయడానికి ఎలాంటి వివరాలు లేవని అన్నాడు. ఆమెకు వందకు గాను కేవలం 61 మార్కులు మాత్రమే ఇచ్చాడు. అతడి ట్వీట్‌ను లక్ష మందికి పైగా రీట్వీట్ చయగా, 3 లక్షల లైకులు వచ్చాయి. అయితే మాజీ గర్ల్‌ఫ్రెండ్ రాసిన లేఖను ఇలా బయటపెట్టడం మాత్రం సరికాదని ఎక్కువ మంది తిట్టిపోశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement