Tesla CEO Elon Musk Old Photo With Ex Girlfriend Goes Shopping Price In Auction - Sakshi
Sakshi News home page

మాజీ గర్ల్‌ఫ్రెండ్‌తో ఎలాన్‌ మస్క్‌ .. ఆ ఫొటోకు వేలంలో ఊహించని ధర.. ఎంతంటే?

Published Sat, Sep 17 2022 3:54 PM | Last Updated on Sat, Sep 17 2022 6:28 PM

Tesla Ceo Elon Musk Old Photo With Ex Girlfriend Goes Shopping Price In Auction - Sakshi

స్పేస్ఎక్స్ అధినేత, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ ఏం చేసినా సంచలనమే. ఆయన షేర్‌ చేసే పోస్ట్‌ల నుంచి వ్యాపారపరంగా తీసుకునే నిర్ణయాల వరకు ప్రతీది వైరల్‌ గా మారి వార్తల్లోకెక్కుతుంది. చివరికి మస్క్‌ టీనేజ్ ఫొటోలను వేలం వేయగా వాటికి కూడా భారీగా డిమాండ్ ఏర్పడింది. ఎంతలా అంటే వాటి కోసం జనాలు ఎగబడి మరీ లక్షలు పోసి కొన్నారు.

మస్క్‌ టీనేజ్‌ ఫోటోలకి భారీ డిమాండ్‌.. ఏకంగా కోటి!
ఎలాన్‌ మస్క్‌పెన్సిల్వేనియా యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో జెన్నిఫర్ గ్విన్‌ అనే యువతితో డేటింగ్‌లో ఉన్నాడు. ఇతర ప్రేమికుల మాదిరిగానే మస్క్‌ కూడా వారి జ్ఞాపకాలు గుర్తుండిపోయేలా ఆమెకు కొన్ని ఫోటోలు, ఇతర వస్తువులను బహుమతిగా ఇచ్చాడు. అయితే ఇదంతా ఒకప్పటి మాట ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో లేరు, ఎవరిపనుల్లో వారు బిజిగా ఉన్నారు. 

తాజాగా మస్క్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ జెన్నిఫర్ గ్వైన్ వీళ్లకు సంబంధించిన ఫొటోలను, వస్తువులను ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచింది. అందులో 18 ఫోటోలు, మస్క్‌ చేతితో వ్రాసిన పుట్టినరోజు కార్డు, తనకు బహుమతిగా ఇచ్చిన బంగారు హారాన్ని ఉంచింది. బోస్టన్‌కు చెందిన ఓ సంస్థ వేలం వేసింది. మస్క్‌, జెన్నిఫర్‌ కలిసి ఉన్న ఫోటో ఏకంగా రూ.1.3 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఫోటోను రివీల్‌ చేయలేదు.  కాగా ఇంత మొత్తానికి ఆ ఫోటో అమ్ముడువుతుందని ఎవరూ ఊహించలేదట.

మస్క్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన నెక్లెస్‌కు రూ. 40 లక్షలు, బర్త్‌డే కార్డుకు రూ.13 లక్షలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఎలాన్‌ మస్క్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌తో లీగల్ వార్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మొదట్లో ట్విటర్‌ని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించి సంచలనానికి తెరలేపిన మస్క్‌, ఆపై పలు కారణాల వల్ల ఈ డీల్ నుంచి తప్పుకున్నారు.

చదవండి: శ్రీమంతుడు 2.0: రూ.24 వేల కోట్ల కంపెనీని విరాళంగా ఇచ్చాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement