Raja Natwarlal
-
కిస్... ‘బోర్డర్’ క్రాస్..!
హీరో ఇవ్రూన్హష్మీ వుుద్దులు ‘హద్దులు’ దాటుతున్నారుు. తాజా చిత్రం ‘రాజా నట్వర్లాల్’లో పాకిస్థాన్ టాప్ హీరోరుున్ హుమైవూ వూలిక్తో నటించిన వుుద్దు సీను.. అక్కడ కలకలం రేపుతోంది. ఈ ‘వుుద్దు’ కట్ చేయూలని అక్కడి జనాలు గోల చేస్తున్నారు. పాక్ సంస్కృతిని వూలిక్ భ్రష్టు పట్టిస్తుందంటూ వుండిపడుతున్నారనేది ‘ది గార్డియున్’ కథనం. డెరైక్టర్.. తీవ్రత లేదంటేనే తాను చేశానని, ఏది ఏమైనా.. అతను పాకిస్థానీ కానందుకే ఈ గొడవంతా అంటోందీ ‘స్వీట్హార్ట’. రీమేక్ ‘సింగమ్’ రోరింగ్! సొంతగా ఆలోచించే పనిలేకుండా... దక్షిణాది చిత్రాల రీమేక్‌లతో కలెక్షన్ కింగ్లైపోతున్నారు బాలీవుడ్ బిగ్ స్టార్లు. పూరీ ‘పోకిరి’ని సల్మాన్ ‘వాంటెడ్’గా చేసుకుని బంపర్ హిట్ కొట్టేశాడు. ఈ దెబ్బకు రీమేక్‌లనే నవుు్మకొని వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. తాజాగా అజయ్ దేవ్‌గణ్ తమిళ్ రీమేక్ ‘సింగమ్ రిటర్న్స్’ బాక్సాఫీసు వద్ద సింహ గర్జన చేస్తోంది. 15 రోజుల్లో ఏకంగా రూ.136.14 కోట్లు వసూలు చేసి సంచలనాలు నమోదు చేస్తోంది. ఐస్.. వైరస్..! ఇదేదో ‘సవాళ్ల సీజన్’లా ఉంది. ఐస్ బకెట్ చాలెంజ్ ఎక్కించిన ఈ వైరస్ రకరకాలుగా రూపాంతరం చెందుతోంది. టాప్ స్టార్లను బాగా పట్టేసింది. తాజాగా వులయూళ సూపర్‌స్టార్ వువుు్మటి... బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్‌కు ఓ కొత్త సవాలు విసిరాడు... ‘మై ట్రీ చాలెంజ్’! తాను స్వయుంగా మొక్కలు నాటి, ఆ ఫొటోలను సోషల్ మీడియూలో పోస్ట్ చేశాడు. మొక్కలతో ఎన్నో ఉపయోగాలున్నాయుంటున్నాడు. వురి షారూఖ్ ఎలా స్పందిస్తాడో! -
రాజా నట్వర్ లాల్‌గా వస్తున్న ఇమ్రాన్
-
ఉచితంగా సినిమాలు చేయను
సినిమాల్లో ఎలా నటించినా నిజజీవితంలో మాత్రం చాలా ప్రాక్టికల్‌గా ఉంటానని చెబుతున్నాడు బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ. ‘రాజా నట్వర్లాల్’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ ముద్దుల వీరుడు ఉచితంగా సినిమాలు చేయనని చెప్పాడు. నటించడం తన కెరీర్లో భాగమని, అందుకే ఉచితంగా ఎవరి బ్యానర్‌లోనూ నటించనని చెబుతున్నాడు. అంతమాత్రాన తాను కేవలం డబ్బుకు మాత్రమే విలువ ఇచ్చే వ్యక్తిని కానన్నాడు. ‘డబ్బు అనేది అందరికీ అవసరమైందే. అంతమాత్రానా దానినే సర్వస్వం అనుకోవడం కూడా సరికాదు. డబ్బులు తీసుకోకుండా సినిమాల్లో నటించడం వంటివి నేను చేయన’ని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. బాలీవుడ్లో దశాబ్ద కాలంగా నటిస్తున్న ఈ హీరోకు మర్డర్, రాజ్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై వంటి చిత్రాలు మంచి పేరునే తెచ్చిపెట్టాయి. ఫుట్‌పాత్, దిల్ తో బచ్చా హై జీ, ఘన్‌చక్కర్ వంటి చిత్రాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయినా నటుడిగా ఇమ్రాన్‌కు మంచి పేరే తెచ్చిపెట్టాయి. అయితే కేవలం డబ్బు కోసమే సినిమాలు చేస్తే ఇప్పటిదాకా రెట్టింపు డబ్బు తనవద్ద ఉండేదని, పాత్రలు నచ్చినందునే సినిమాలు అంగీకరించానని చెబుతూనే ఇకపై పాత్రలతోపాటు నటించినందుకు ఇచ్చే పారితోషికం కూడా నచ్చితేనే పచ్చజెండా ఊపుతాన ంటున్నాడు. ఇక రాజా నట్వర్లాల్ సినిమా గురించి మాట్లాడుతూ... సినిమా చూస్తూ ప్రేక్షకులు చప్పట్లు కొట్టకపోతే అది ముమ్మాటికీ వారిని వారు మోసగించుకున్నట్లే అవుతుందని, సినిమా అంత బాగా కుదిరిందని చెప్పాడు. ఘన్‌చక్కర్ సినిమా కోసం కూడా ప్రయోగాలు చేసి, వైఫల్యాన్ని ఎదుర్కొన్న తాను ఈసారి ప్రయోగాత్మక చిత్రం ద్వారా ప్రేక్షకుల మన్ననలందుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు. ప్రేక్షకులు కోరుకునే అన్ని హంగులు ఈ చిత్రంలో ఉన్నాయని చెప్పాడు. -
ముద్దు..ముచ్చట
ముద్దు సీన్లలో నటించేందుకు పెద్దగా ఇబ్బంది పడలేదని చెబుతోంది పాకిస్థానీ నటి హుమైమా మాలిక్. బాలీవుడ్లో ఆమె తొలిచిత్రం ‘రాజా నట్వర్లాల్’ ఆగస్టు 29న విడుదల కానుంది. బాలీవుడ్ ‘ముద్దుల’ వీరుడు ఇమ్రాన్ హష్మీ సరసన హుమైమా ఈ సినిమాలో ముద్దుసీన్లు పండించింది. అయితే, తాను బికినీ మాత్రం ధరించలేదని..లేనని చెబుతోంది. -
ఇమ్రాన్... అందరికీ జాన్
ముంబై: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మికి పాకిస్థాన్‌లో ఎంతోమంది అభిమానులు ఉన్నారని పాకిస్థాన్ నటి, మోడల్ హ్యుమైమా మాలిక్ పేర్కొంది. ఇమ్రాన్‌తో కలిసి హ్యుమైమా ‘రాజా నట్వర్లాల్’ సినిమాలో నటిస్తోంది. ‘వాస్తవానికి ఇమ్రాన్‌ను పాకిస్థానీయుడని తమ దేశ ప్రజలు అనుకుంటారు. ఇమ్రాన్ సినిమా విడుదలైతే మా దేశంలో ఓపెనింగ్స్ బాగుంటాయి’ అని అంది. ప్రేక్షకులు ఇమ్రాన్‌ను ఎంతో ఇష్టపడతారని, ఎక్కువమంది అతనిని పాకిస్థానీ జాతీయుడిగానే భావిస్తార ని తెలిపింది. అందువల్ల తాను నటిస్తున్న ‘రాజా నట్వర్లాల్’ సినిమాకు తమ దేశంలో మంచి ఓపెనింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపింది. కునాల్ దేశ్‌ముఖ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఎటువంటి పాత్రలైనా చేసేందుకు సిద్ధమేనని ‘బోల్’ సినిమాలో తన నటనా శైలితో విమర్శకులనుంచి ప్రశంసలందుకున్న హ్యుమైమా పేర్కొంది. ఒక నటిగా సినిమాలకు సంబంధించినంతవరకూ తనపై తాను ఎటువంటి పరిమితులను విధించుకోదలుచుకోలేదని చెప్పింది. అయితే అర్ధవంతమైన పాత్రలను పోషించేందుకు ఇష్టపడతానంది. అందులోనూ తన పాత్ర సినిమాలో కచ్చితంగా కీలకమైనదిగా ఉండాలని అభిలషిస్తున్నట్టు తెలిపింది. ఇమ్రాన్ రొమాన్స్ సీన్లను పండిస్తాడని అభిప్రాయపడింది. ‘రాజా నట్వర్లాల్’ సినిమాలో సైతం అనేక రొమాన్స్ సీన్లను పండించాడంది. ‘అతనో కూల్ పర్సన్. చక్కని సహనటుడు అని ఈ 28 ఏళ్ల మోడల్ తన మనసులో మాట చెప్పింది. వృత్తికి అంకితమవుతాడంటూ ప్రశంసల జల్లు కురిపించింది.