ముద్దుల్లో మొనగాడు..! | Humaima Malick: Emraan Hashmi is an expert in kissing! | Sakshi
Sakshi News home page

ముద్దుల్లో మొనగాడు..!

Published Mon, Aug 4 2014 11:31 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ముద్దుల్లో మొనగాడు..! - Sakshi

ముద్దుల్లో మొనగాడు..!

బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మీని పాకిస్థాన్ నటి హుమైమా మాలిక్ తెగ పొగిడేస్తోంది. రాజా నట్వర్‌లాల్ సినిమాలో ఇద్దరు కలిసి నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో హుమైమా-హష్మీల మధ్య పలు శృంగార దృశ్యాలున్నాయి. వీటి గురించి హుమైమా మాట్లాడుతూ... ‘రాజా నట్వర్‌లాల్‌లో ఇమ్రాన్‌తో కలిసి నటించడం సౌకర్యంగానే అనిపించింది. మిగతా సమయాల్లో ఎలా ఉన్నా ప్రత్యేకించి ముద్దు దృశ్యాలను చిత్రీకరించే రోజు కాస్త అసౌకర్యంగా అనిపించింది. ఎందుకంటే నా నటజీవితంలో ఇప్పటిదాకా ముద్దు సీన్లలో నటించలేదు.
 
 తొలిసారి కావడంతో షూటింగ్ ముందు రోజంతా అసౌకర్యంగానే ఫీలయ్యాను. అయితే అప్పటికే ముద్దు సీన్లను పండించడంలో అనుభవమున్న ఇమ్రాన్ నా భయాన్నంతా పోగొట్టాడు. అసభ్యంగా ఉందన్న అభిప్రాయం ఏమాత్రం కలగకుండా చేశాను. మొత్తానికి అంతా బాగానే జరిగిపోయింది. పలు శృంగార దృశ్యాలను కూడా అసభ్యతకు ఏమాత్రం తావులేకుండా దర్శకుడు తెరకెక్కించాడు. అయితే ఇటువంటి దృశ్యాల్లో నటించిన తర్వాత నేను మళ్లీ పాకిస్థాన్‌కు వెళితే తప్పకుండా ఇబ్బందులు ఎదురవుతాయి. మానసికంగా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నాను.
 
 అది కేవలం నటన మాత్రమే. నా నటనతో పాకిస్థాన్‌కు పేరుప్రఖ్యాతులు సంపాదించిపెట్టాను. ‘బోల్’ సినిమా ఆడిషన్స్ కోసం దేశవిదేశాల నుంచి ఎంతోమంది వచ్చినా నేను ఎంపిక కావడం, ఆ చిత్రంలో నా నటనకు లండన్ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు రావడాన్ని పాకిస్థాన్ ప్రేక్షకులు గుర్తుంచుకుంటారని అనుకుంటున్నా. నాకు అండగా నిలుస్తారని భావిస్తున్నా. విమర్శించేవారు కూడా ఉంటారు. వారి విమర్శలను పట్టించుకుంటే కెరీర్‌లో నేను ఇంతకుమించి ముందుకెళ్లలేన’ని చెప్పింది. ఇదిలాఉండగా తాను ఇకపై బికినీ వేసుకొని తెరపై కనిపించనని స్పష్టం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement