వాన అనుభవం బాగుందన్న హుమైమా | Humaima loved shooting rain song with Emraan hashmi | Sakshi
Sakshi News home page

వాన అనుభవం బాగుందన్న హుమైమా

Published Thu, Jul 31 2014 1:56 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

వాన అనుభవం బాగుందన్న హుమైమా - Sakshi

వాన అనుభవం బాగుందన్న హుమైమా

బాలీవుడ్లో తొలిసారిగా వానపాటలో నర్తించిన పాకిస్థానీ మోడల్, నటి హుమైమా మాలిక్.. ఆ అనుభవం చాలా బాగుందని చెబుతోంది. ఇమ్రాన్ హష్మీతో కలిసి 'రాజా నట్వర్లాల్' అనే సినిమాలో 'తేరే హోకే రహేంగే' అనే వానపాటకు ఆమె నర్తించింది. తాను వానపాటలో నటించడం ఇదే తొలిసారని, ఈ అనుభవం చాలా బాగుందని ఆమె చెప్పింది. బాలీవుడ్లో వానపాటల్లో ఎలా చేస్తారో తెలుసుకోడానికి ఆమె పలు వానపాటల వీడియోలు ముందుగా చూసి మరీ చేసిందట.

తొలిసారి తాను వానపాటలో నటించానని, ముందు రోజు రాత్రంతా బాలీవుడ్ వానపాటలను చూస్తూనే ఉన్నానని పాట ఆవిష్కరణ సందర్భంగా హుమైమా చెప్పింది. వానపాటల్లో నర్తించడం చాలా ఆసక్తికరమైన అనుభవమని, దాన్ని తాను చాలా ఆస్వాదించానని తెలిపింది. రెండు రోజుల పాటు చాలా కష్టపడి ఆ పాట షూటింగ్ చేశామని వివరించింది. ఈ పాటను అరిజిత్ సింగ్ పాడాడు. కునాల్ దేశ్ముఖ్ దర్శకత్వం వహించిన 'రాజా నట్వర్లాల్' సినిమాలో పరేష్ రావల్, కే కే మీనన్ కూడా ఉన్నారు. ఇది ఆగస్టు 29న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement