అతను రొమాన్స్ సీన్లలో దిట్ట! | Emraan Hashmi is good at romance,says Humaima Malick | Sakshi
Sakshi News home page

అతను రొమాన్స్ సీన్లలో దిట్ట!

Published Sat, Jul 26 2014 9:36 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అతను రొమాన్స్ సీన్లలో దిట్ట! - Sakshi

అతను రొమాన్స్ సీన్లలో దిట్ట!

ముంబై: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి రొమాన్స్ సీన్లను అద్భుతంగా పండిస్తాడని పాకిస్తాన్ నటి, మోడల్ హ్యుమైమా మాలిక్ స్పష్టం చేసింది. ఇమ్రాన్ కి పాకిస్థాన్‌లో ఎంతోమంది అభిమానులు ఉన్నారని ఆమె పేర్కొంది.  ఇమ్రాన్‌తో కలిసి హ్యుమైమా ‘రాజా నట్వర్‌లాల్’ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాకు తమ దేశంలో మంచి ఓపెనింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నట్టు తెలిపింది. కునాల్ దేశ్‌ముఖ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఎటువంటి పాత్రలైనా చేసేందుకు సిద్ధమేనని ‘బోల్’ సినిమాలో తన నటనా శైలితో విమర్శకులనుంచి ప్రశంసలందుకున్న హ్యుమైమా పేర్కొంది. ఒక నటిగా సినిమాలకు సంబంధించినంతవరకూ తనపై తాను ఎటువంటి పరిమితులను విధించుకోదలుచుకోలేదని చెప్పింది.

 

అయితే అర్ధవంతమైన పాత్రలను పోషించేందుకు ఇష్టపడతానంది. అందులోనూ తన పాత్ర సినిమాలో కచ్చితంగా కీలకమైనదిగా ఉండాలని అభిలషిస్తున్నట్టు తెలిపింది. ఇమ్రాన్ రొమాన్స్ సీన్లను పండిస్తాడని అభిప్రాయపడింది. ‘రాజా నట్వర్‌లాల్’  సినిమాలో సైతం అనేక రొమాన్స్ సీన్లను పండించాడంది. ‘అతనో కూల్ పర్సన్. చక్కని సహనటుడు అని ఈ 28 ఏళ్ల మోడల్ తన మనసులో మాట చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement