ముద్దు పెట్టడం ఒక కళ.. అదో ఆర్ట్ | Emraan Hashmi to well act in romance liplock scenes | Sakshi
Sakshi News home page

ముద్దు పెట్టడం ఒక కళ.. అదో ఆర్ట్

Published Sat, Aug 9 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM

ముద్దు పెట్టడం ఒక కళ..  అదో ఆర్ట్

ముద్దు పెట్టడం ఒక కళ.. అదో ఆర్ట్

మూవీ బజ్: ముద్దు పెట్టడం ఒక కళ.. అది అందరికీ వచ్చేది కాదంటున్నాడు ముద్దుల హీరో ఇమ్రాన్ హష్మీ. ఆన్‌స్క్రీన్‌పై చుంబనాలతో విరుచుకుపడే హష్మీ.. మిగతా వారికి తనలా ముద్దించడం సాధ్యం కాదని బడాయి పోతున్నాడు. పెదాలకు లంగరేయడంలో వెయ్యి గంటల ఎక్స్‌పీరియన్స్ ఉన్న తనకూ, ఈ విషయంలో కనీసం పది గంటల పనితనం లేని వారికి మధ్య జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందని చెప్పుకొచ్చాడు.
 
 ఐ హర్ట్
 హమ్‌షకల్స్ మూవీ సాజిద్ ఖాన్ డెరైక్షన్‌లో మళ్లీ నటించేది లేదంటోంది బిపాసాబసు. ఈ సినిమాలో తన రోల్‌ను కేవలం ఆరు నిమిషాలకే పరిమితం చేయడంపై గుర్రుగా ఉన్న బిపాసా..  షాజిద్‌పై దుమ్మెత్తి పోసింది. ఆ ఆరు నిమిషాలూ తానేం చేశానో తనకే అర్థం కాలేదంటోంది. డెరైక్టర్ నిర్వాకం వల్ల తాను హర్ట్ అయ్యానని.. సినిమా చూసినవాళ్లూ ఈ విషయం  అర్థం చేసుకున్నారని చెప్పుకొచ్చింది.  
 
 డోన్ట్ ట్రస్ట్
 సౌత్ ఇండియన్ ముద్దుగుమ్మ హన్సిక అందరికీ ఓ వార్నింగ్ ఇచ్చింది. తన మేనేజర్‌నని చెప్పి ఎవరైనా ఆర్థిక లావాదేవీలకు పాల్పడితే తనకేం సంబంధం లేదని చెప్పింది. ఇలాంటి వ్యవహారాలు తన దృష్టికి వచ్చాయన్న హన్సిక.. తన సినిమా వ్యవహారాలన్నీ తన తల్లే చూసుకుంటుందని చెప్పుకొచ్చింది. ఇక మీదట తన మేనేజర్‌నంటూ చెప్పుకునే వారిని నమ్మొద్దని సలహా ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement