మా మధ్య కెమిస్ట్రీ లేదు.. అందుకే అంత ఇబ్బంది: హీరోయిన్‌ | Tanushree Dutta on Her Awkward Kiss with Emraan Hashmi | Sakshi
Sakshi News home page

Tanushree Dutta: ఆ హీరో సీరియల్‌ కిస్సర్‌.. కానీ మా మధ్య కెమిస్ట్రీ లేకపోవడం వల్ల..

Published Sat, Dec 9 2023 9:37 AM | Last Updated on Sat, Dec 9 2023 10:03 AM

Tanushree Dutta on Her Awkward Kiss with Emraan Hashmi - Sakshi

మీటూ ఆరోపణలు చేసినందుకుగానూ చేతిలో అవకాశాల్లేక వెండితెరకు దూరమై చాలాకాలమైంది. అయితే తనకు మంచి గుర్తింపునిచ్చిన ఆషికి బనాయా ఆప్నే సినిమా గురిం

బాలీవుడ్‌ హీరోయిన్‌ తనుశ్రీ దత్తా ఆషికి బనాయా ఆప్నే సినిమాతో వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టింది. వీరభద్ర సినిమాతో తెలుగులోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఇక్కడ తనకు సరైన అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌లోనే సెటిలైపోయింది. కానీ మీటూ ఆరోపణలు చేసినందుకుగానూ చేతిలో అవకాశాల్లేక వెండితెరకు దూరమై చాలాకాలమైంది. అయితే తనకు మంచి గుర్తింపునిచ్చిన ఆషికి బనాయా ఆప్నే సినిమా గురించి, అందులోని ముద్దు సన్నివేశం గురించి మాట్లాడిందీ బ్యూటీ.

మా మధ్య కెమిస్ట్రీ లేదు
ఇమ్రాన్‌తో కలిసి మూడు సినిమాల్లో నటించాను. చాకొలెట్‌ మూవీలోనూ మా మధ్య ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించారు. కానీ ఎడిటింగ్‌లో తీసేశారు. అయితే ఫస్ట్‌ టైమ్‌ అలాంటి సీన్‌ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం చాలా ఇబ్బందిపడ్డాను. రెండోసారి మరీ అంత ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే నిజ జీవితంలో మా మధ్య ఎటువంటి కెమిస్ట్రీ లేదు. అయితే అతడికి అప్పటికే కిస్సర్‌ బాయ్‌ అనే ఇమేజ్‌ ఉంది. అయినా నాకెందుకో అతడితో అటువంటి సీన్‌లో నటించడం అంత సౌకర్యంగా అనిపించలేదు అని చెప్పుకొచ్చింది.

సినిమాల సంగతి..
కాగా తనుశ్రీ దత్తా, ఇమ్రాన్‌ హష్మీ.. 'ఆషికి బనాయా ఆప్నే', 'చాకొలెట్‌: డీప్‌ డార్క్‌ సీక్రెట్స్‌', 'గుడ్‌ బాయ్‌.. బ్యాడ్‌ బాయ్‌' అనే సినిమాలు చేశారు. తనుశ్రీ దత్తా చివరగా 2013లో వచ్చిన హమ్‌ నే లీ హై శపథ్‌ సినిమాలో కనిపించింది. ఇక ఇమ్రాన్‌ హష్మీ విషయానికి వస్తే ఇతడు గ్యాంగ్‌స్టర్‌, వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ ముంబై, ద డర్టీ పిక్చర్‌, శాంఘై వంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. చివరగా టైగర్‌ 3 మూవీలో కనిపించాడు.

చదవండి: తుపాన్‌ బాధితులకు అండగా నిలిచిన కోలీవుడ్‌ సెలబ్రిటీలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement